IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో రెండో రోజు ప్రతిఘటిస్తుందనుకున్నభారత జట్టు అనూహ్యంగా ఆలౌటయ్యింది. లంచ్ తర్వాత టకటకా వికెట్లు కోల్పోయిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకే కుప్పకూలింది. పాదం నొప్పిని పంటిబిగువన భరిస్తూనే రిషభ్ పంత్(54).. సమయోచిత బ్యాటింగ్‌తో శార్థూల్ ఠాకూర్(41) పోరాడినా బెన్ స్టోక్స్ (5-72) దెబ్బకొట్టాడు. ఐదు వికెట్లుతో చెలరేగిన ఇంగ్లండ్ సారథికి స్పీడ్‌స్టర్ ఆర్చర్ కూడా తోడవ్వడంతో రెండో సెషన్లో కాసేపటికే గిల్ సేన ఇన్నింగ్స్ ముగిసింది.
ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో రెండో రోజు కూడా భారత ఆటగాళ్లు అసమాన పోరాటం కనబరిచారు. నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతున్న ఇంగ్లండ్ బౌలర్లను కాచుకొని క్రీజులో నిలిచారు. ఓవర్ నైట్ స్కోర్ 264-4తో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు తొలి సెషన్లో ఆర్చర్ షాకిచ్చాడు. స్లిప్‌లో బ్రేక్ క్యాచ్ పట్టడంతో రవీంద్ర జడేజా(20)ను వెనక్కి పంపాడు. జడ్డూ మేమున్నామంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు శార్థూల్ ఠాకూర్(41), వాషింగ్టన్ సుందర్(27)లు. ఇద్దరూ గోడలా నిలిచి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరూ సమయోచితంగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్ష పెట్టారు. సింగిల్స్, డబుల్స్.. చెత్త బంతులకు బౌండరీ అన్నట్టుగా సాగింది వీళ్ల బ్యాటింగ్. ఆరో వికెట్‌కు కీలకమైన 48 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జంటను విడదీసి స్టోక్స్ ఇండియాను మరింత కష్టాల్లోకి నెట్టాడు.
#TeamIndia post 358 on the board!
6⃣1⃣ for Sai Sudharsan
5⃣8⃣ for Yashasvi Jaiswal
5⃣4⃣ for vice-captain Rishabh PantUpdates ▶️ https://t.co/L1EVgGtx3a#ENGvIND | @sais_1509 | @ybj_19 | @RishabhPant17 pic.twitter.com/4GFLPG3T9U
— BCCI (@BCCI) July 24, 2025
అయితే.. జట్టును ఆదుకునేందుకు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్ క్రీజులోకి వచ్చాడు. పాదం నొప్పిని భరిస్తూనే అతడు వికెట్ కాపాడకుంటూనే స్కోర్ బోర్డును ఉరికించాడు. వర్షం కారణంగా ముందుగానే లంచ్ బ్రేక్ ఇవ్వగా అప్పటికి గిల్ సేన 6 వికెట్ల నష్టానికి 321 రన్స్ చేసింది. విరామం తర్వాత ఇంగ్లండ్ పుంజుకుంది. ముఖ్యంగా కెప్టెన్ స్టోక్స్.. సుందర్, అన్షుల్ వికెట్లు తీసి ఎనిమిదేళ్ల తర్వాత ఐదు వికెట్ల ఫీట్ నమోదు చేశాడు. ఓ వైపు సహచరులు ఔటవుతున్నా.. పంత్ మాత్రం పట్టువీడలేదు. ఆర్చర్ ఓవర్లో కళ్లు చెదిరే సిక్సర్.. ఆపై స్టోక్స్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా బౌండరీతో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు వైస్ కెప్టెన్. కానీ.. అతడిని బౌల్డ్ చేసిన ఆర్చర్.. కొద్ది సేపట్లోనే బుమ్రాను వెనక్కి పంపి భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు. సాయి సుదర్శన్(61), యశస్వీ జైస్వాల్(58), పంత్ రాణించడంతో టీమిండియా 350 ప్లస్ కొట్టగలిగింది.
𝙂𝙧𝙞𝙩. 𝙂𝙪𝙩𝙨. 𝙂𝙪𝙢𝙥𝙩𝙞𝙤𝙣!
When Old Trafford stood up to applaud a brave Rishabh Pant 🙌 🫡#TeamIndia | #ENGvIND | @RishabhPant17 pic.twitter.com/nxT2xZp134
— BCCI (@BCCI) July 24, 2025