కట్టంగూర్, జూలై 24 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికుల పింఛన్లను రూ.4 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కట్టంగూర్ లోని వైవీఆర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ఎమ్మార్పీఎస్ సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న గోవింద్ నరేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మార్బీఎస్ అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడి అనేక సామాజిక సమస్యలపై పోరాడుతుందని తెలిపారు.
అన్ని రకాల పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 1న మిర్యాలగూడెంలో చేయూత పింఛన్దారుల జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిధిగా మంద కృష్ణమాదిగ హాజరవుతున్నట్లు తెలిపారు. ఎమ్మార్సీఎస్ నాయకులు, కార్యకర్తలు, చేయూత పింఛన్ దారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి వంగూరి ప్రసాద్, కట్టంగూర్, నకిరేకల్ మండలాధ్యక్షులు మేడి శ్రీను, గాదె రాజు, పట్టణ అధ్యక్షుడు మైనం దేవేందర్, నాయకులు పిల్లి రవి, దాసరి ప్రవీణ్, నకిరేకంటి వెంకటరత్నం, జెల్ల వెంకటేశ్వర్లు, ఇంద్రకంటి నగేశ్, వంటిపాక వెంకన్న, దేశగోని యుగేందర్, జిల్లా రవి, మామిడి వెంకట్ పాల్గొన్నారు.