IPL 2024 : మరో పదిరోజుల్లో క్రికెట్ పండుగ.. ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. మండుటెండ్లలో అభిమానులకు వినోదాన్ని పంచే ఈ మెగాటోర్నీకి ముందు భారత క్రికెట్ బోర్డు(BCCI) కీలక ప్రకటన చేసింది. స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) పునరామనంపై నెలకొన్న పలు సందేహాలకు తెరదించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)లో పంత్ వికెట్ కీపర్, బ్యాటర్‌గా ఆడేందుకు అనుమతించింది. అంతేకాదు స్టార్ పేసర్లు మమ్మద్ షమీ, ప్రసిధ్ కృష్ణలు సీజన్ మొత్తానికి దూరం అయ్యారని బీసీసీఐ వెల్లడించింది.
ఐపీఎల్లో కీలక ఆటగాళ్లు ఆడడంపై మంగళవారం బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ‘2022 డిసెంబర్ 30వ తేదీన ఘోరమైన కారు ప్రమాదం. 14 నెలల రిహాబిలిటేషన్, కష్టమైన వ్యాయామాల అనంతరం ఐపీఎల్ 17వ సీజన్లో పంత్ వికెట్ కీపర్, బ్యాటర్‌గా ఆడనున్నాడు. పేసర్లు షమీ, ప్రసిధ్లు టోర్నీలో బరిలోకి దిగడం లేదు’ అని రాసుకొచ్చింది.
🚨 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 𝗼𝗻 𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 𝗣𝗮𝗻𝘁:
After undergoing an extensive 14-month rehab and recovery process, following a life-threatening road mishap on December 30th, 2022, @RishabhPant17 has now been declared fit as a wicket-keeper batter for the upcoming #TATA @IPL 2024…
— BCCI (@BCCI) March 12, 2024
షమీ, ప్రసిధ్ కృష్ణ
పంత్‌కు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) వైద్య బృందం ఈ డాషింగ్ బ్యాటర్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది. దాంతో, 17వ సీజన్‌తో ఐపీఎల్లో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. కానీ, కేవలం బ్యాటర్‌గానే ఆడుతాడనే సందేహాలు నెలకొన్నాయి. కానీ, బీసీసీఐ తాజా ప్రకటనతో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) యాజమాన్యం, అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు.
🚨 NEWS 🚨
Ahead of the #TATA @IPL 2024, the BCCI has issued the following medical and fitness updates for Rishabh Pant, Prasidh Krishna & Mohd. Shami.
Details 🔽 #TeamIndiahttps://t.co/VQDYeUnnqp
— BCCI (@BCCI) March 12, 2024
ఇక.. ఈ మధ్యే లండన్‌లో సర్జరీ చేయించుకున్న షమీ ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నాడు. మరోవైపు ప్రసిధ్ కృష్ణ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. రెండేండ్ల క్రితం కారు యాక్సిడెంట్లో మృత్యుంజయుడిలా బయటపడిన పంత్ ముంబైలో మోకాలి సర్జరీ(Knee Surgery) చేయించుకున్నాడు. అనంతరం ఎన్సీఏలో 14 నెలలు రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు.
అక్కడ నిపుణుల పర్యవేక్షణలో కష్టమైన వ్యాయామాలు చేసి ఫిట్నెస్ సాధించాడు. ఈ మధ్యే పంత్ నెట్స్‌లో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ పునరాగమనానికి సిద్దమని చెప్పకనే చెప్పాడు. మార్చి 22న చెన్నైలో ఆరంభం కానుంది. పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ జట్టు మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.