Couple Divorce Over Lipstick | రూ.30 లిప్‌స్టిక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఖరీదైనదిగా ఆరోపించి విడాకులు డిమాండ్ చేసిన భార్య
Couple Divorce Over Lipstick | ఒక వ్యక్తి తన భార్యకు రూ.30 విలువైన లిప్‌స్టిక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అంత ఖరీదైన లిప్‌స్టిక్ భర్త కొనడంపై భార్య ఆగ్రహించింది. ఈ సందర్భంగా వారి మధ్య గొడవ జరుగడంతో అలిగి పుట్టింటికి వెళ్లింది. అలాగే భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోపాటు విడాకులు డిమాండ్ చేసింది.
లక్నో: ఒక వ్యక్తి తన భార్యకు రూ.30 విలువైన లిప్‌స్టిక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అంత ఖరీదైన లిప్‌స్టిక్ భర్త కొనడంపై భార్య ఆగ్రహించింది. ఈ సందర్భంగా వారి మధ్య గొడవ జరుగడంతో అలిగి పుట్టింటికి వెళ్లింది. అలాగే భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోపాటు విడాకులు డిమాండ్ చేసింది. (Couple Divorce Over Lipstick) చివరకు పోలీసులు ఆ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో జరిగింది. ఎత్మాద్పూర్ ప్రాంతానికి చెందిన మహిళకు మధురకు చెందిన వ్యక్తితో రెండేళ్ల కిందట వివాహమైంది.
కాగా, ఇటీవల ఆ వ్యక్తి తన భార్యకు రూ.30 విలువైన లిప్‌స్టిక్‌ను బహుమతిగా ఇచ్చాడు. అయితే దీని కోసం అతడు ఎక్కువగా ఖర్చు చేశాడంటూ భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. చౌకైన లిప్‌స్టిక్ ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించింది. ఈ అంశంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది.
మరోవైపు లిప్‌స్టిక్ వివాదంపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకోకుండా అతిగా ఖర్చు చేస్తున్న భర్త నుంచి విడాకులు కోరింది. దీంతో భార్యాభర్తలను ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పోలీసులు రప్పించారు. వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై భార్య కోరిన విధంగా తక్కువ ఖరీదు లిప్‌స్టిక్ కొనుగోలు చేస్తానని భర్త భరోసా ఇచ్చాడు. దీంతో ఆ దంపతుల వివాదం సమసిపోయిందని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

