Korean Mango Milk Recipe : మార్చి తొలి వారంలోనే మండే ఎండలతో వేసవి ఎంట్రీ ఇచ్చేసింది. వేసవి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మ్యాంగో సీజన్. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్‌గా పేరొందిన మ్యాంగోను ఇష్టపడని వారు అరుదు. మ్యాంగోను ఎన్నో వెరైటీల్లో ఆస్వాదిస్తుంటారు. ఐస్‌క్రీం, ఛీజ్‌కేక్, షర్బత్, మిల్క్ ఇలా ఎన్నో రకాలుగా ఈ ఫ్రూట్‌ను మిక్స్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు.
వేసవిలో చాలా మంది మ్యాంగో మిల్క్‌ను ఇష్టంగా తీసుకుంటారు. ఇక కొరియన్ మ్యాంగో మిల్క్‌ను ట్రై చేసి టేస్టీ సమ్మర్ డ్రింక్‌ను ఆస్వాదించాలనుకుంటే అసలు ఈ డ్రింక్ ఎలా తయారుచేస్తారో తెలుసుకోండి. రెగ్యులర్ మ్యాంగో మిల్క్ కంటే కొరియర్ మ్యాంగో మిల్క్ విభిన్నమైన రుచి, ఫ్లేవర్‌ను కలిగిఉంటుంది.
మామిడి రంసంలో ఐస్, మిల్క్‌ను జోడించిన తర్వాత సగ్గుబియ్యం మిక్స్ చేయాలి. సంప్రదాయ మ్యాంగో మిల్క్‌లో వీటన్నింటిని కలిపితే సూపర్ క్రీమీ, స్మూత్ టెక్ట్చర్తో మ్యాంగో లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో హై షుగర్ కంటెంట్ ఉండటంతో పరిమిత మోతాదులో తీసుకోవడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Read More :