Tech Tips | మీ మొబైల్ పోయిందా? వెంటనే ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!
ఇప్పుడున్న సాంకేతిక యుగంలో ప్రాణప్రదమైన వస్తువు ఏమిటి? అని అడిగితే అందరూ సెల్‌ఫోన్ అనే సమాధానం ఇస్తారు. అరగంట ఫోన్ కంటపడకపోతే జీవితం కుంటుపడిపోయిందన్న ఫీలింగ్‌లో చాలామంది కొట్టుమిట్టాడుతుంటారు. అదే ఫోన్‌ను దొంగలెత్తుకుపోతే, ఎక్కడో మర్చిపోతే.. ప్రాణాలు పోయినంత పనవుతుంది.
Tech Tips | ఇప్పుడున్న సాంకేతిక యుగంలో ప్రాణప్రదమైన వస్తువు ఏమిటి? అని అడిగితే అందరూ సెల్‌ఫోన్ అనే సమాధానం ఇస్తారు. అరగంట ఫోన్ కంటపడకపోతే జీవితం కుంటుపడిపోయిందన్న ఫీలింగ్‌లో చాలామంది కొట్టుమిట్టాడుతుంటారు. అదే ఫోన్‌ను దొంగలెత్తుకుపోతే, ఎక్కడో మర్చిపోతే.. ప్రాణాలు పోయినంత పనవుతుంది. అందులో ఉన్న విలువైన సమాచారం దుర్వినియోగం అవుతుందని భయపడుతుంటారు. పోయింది విలువైన ఫోన్ అయితే.. ఆ బాధ చెప్పనక్కర్లేదు. ఈ ఆందోళనలకు కాలం చెల్లింది. మీ ఫోన్‌ను కంటికి రెప్పలా కాపాడే ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. భారతీయ టెలికాం విభాగం సంధించిన బ్రహ్మాస్త్రం సీఐఈఆర్ పోర్టల్. ఆ విశేషాలు ఇవి..
భారతీయ టెలికాం విభాగం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్ (సీఐఈఆర్)ను అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా https://ceir.gov.in వెబ్‌లింక్ ద్వారా దానిని నేరుగా బ్లాక్ చేయొచ్చు. ఫోన్‌ను ట్రాక్ చేయొచ్చు. సీఐఈఆర్ సేవలు భారతదేశం అంతటా అందుబాటులో ఉన్నాయి. సంచార్‌సాథి పోర్టల్ (https://ceir.sancharsaathi.gov.in/Home/index.jsp) ద్వారా కూడా సీఐఈఆర్ పోర్టల్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఐఎమ్ఈఐ నంబర్ ద్వారా మొబైల్‌ను ట్రాక్ చేయొచ్చు. సీఐఈఆర్ ద్వారా మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేస్తే.. దొంగతనానికి గురైన హ్యాండ్‌సెట్‌కు ఏ మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ అందవు. అందులో ఉన్న ఫైల్స్‌ను యాక్సెస్ చేయడం కూడా కుదరకుండా హ్యాండ్‌సెట్‌ను బ్లాక్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే.. ఒక డెడ్ఫోన్లా మారిపోతుందన్నమాట!
తక్షణ ఫిర్యాదు..
హ్యాండ్సెట్ మిస్సయినట్లయితే పోలీసులను వెంటనే సంప్రదించాలి. ఎఫ్ఐఆర్, లాస్ట్ మొబైల్ సర్టిఫికేట్ చెక్ చేసి పోలీసులు నంబర్‌ను బ్లాక్ చేస్తారు. అప్పుడు దొంగతనానికి గురైన ఫోన్‌ను ఎవరు వినియోగిస్తున్నారో పోలీసులు (లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ) తెలుసుకోగలుగుతారు. సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి.. ఆ మొబైల్‌ను వినియోగిస్తున్న వ్యక్తి వివరాలను తెలుసుకుంటారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఫోన్‌ను అసలు యజమానికి అందజేస్తారు.
మీరే బ్లాక్ చేయొచ్చు..
- ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి. ప్రత్యామ్నాయంగా ‘మీ సేవ’ నుంచి లాస్ట్ ఇన్స్ట్రుమెంట్ సర్టిఫికేట్ గానీ, పిటిషన్ రసీదు కాపీ ద్వారా గానీ డూప్లికేట్ సిమ్ పొందొచ్చు.
- సీఐఈఆర్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత.. పిటిషన్ రసీదు, ఎఫ్ఐఆర్ కాపీ, ఆధార్/ ఓటర్ ఐడీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించిన తర్వాత రిఫరెన్స్ ఐడీ వస్తుంది.
- మీ మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయమని కోరండి. అప్పుడు మీ రిజిస్టర్డ్ ఫోన్‌నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే.. నంబర్ బ్లాక్ అవుతుంది.
- మీ హ్యాండ్సెట్ రికవరీ అయిన తర్వాత.. అదే వెబ్సైట్లోకి వెళ్లి ఫోన్‌ను అన్‌బ్లాక్ చేసుకోవచ్చు
సంచార్సాథీలో ఎన్నెన్నో..
మొబైల్ వినియోగదారులకు వెన్నుదన్నుగా నిలవడమే సంచార్‌సాథీ పోర్టల్ ఉద్దేశం. మొబైల్ కనెక్షన్లు ఇవ్వడం, డిస్కనెక్ట్ చేయడం, పోగొట్టుకున్న ఫోన్లను బ్లాక్ చేయడం, ట్రేస్ చేయడం, పాత ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఆ పరికరం వాస్తవికతను తెలుసుకోవడం ఇలాంటి విషయాలన్నీ ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. సంచార్సాథీలో ఉన్న మాడ్యుల్స్ ఇవి..
- CEIR- మీ పాత ఫోన్‌ను, దొంగతనానికి గురైన ఫోన్‌ను బ్లాక్ చేయొచ్చు.
- TAFCOP- మీ పేరు మీద ఉన్న మీ మొబైల్ కనెక్షన్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఏదైనా నంబర్ మీరు వాడనట్లయితే రిపోర్ట్ చేయొచ్చు.
- RICIWIN- ఇండియన్ నంబర్ నుంచి ఏమైనా ఇంటర్నేషనల్ కాల్స్ వస్తే.. వెంటనే రిపోర్ట్ చేయొచ్చు.
- KYI- వైర్‌లైన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కనుక్కోవచ్చు.

కేవైఎమ్ తెలుసుకుందాం
సీఐఈఆర్ పోర్టల్‌లో కేవైఎమ్ (Know Your Mobile) ఫీచర్ ద్వారా సెకండ్ హ్యాండ్ ఫోన్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునే వీలు ఉంటుంది. కొనుగోలు చేయదలచిన మొబైల్ బ్లాక్‌లిస్ట్‌లో ఉందా, నకిలీదా, ఇప్పటికే వేరేవాళ్లు ఉపయోగిస్తున్నారా ఈ విషయాలన్నీ తేటతెల్లం అవుతాయి. ఐఎమ్ఈఐ నంబర్‌ను ఉపయోగించి కేవైఎమ్ ఫీచర్‌ను ఉపయోగించొచ్చు. ఐఎమ్ఈఐ నంబర్ అందుబాటులో లేకపోతే *#06# డయల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. సీఐఈఆర్ పోర్టల్‌లో మీ ఐఎమ్ఈఐ నంబర్‌ను ధ్రువీకరించుకోవచ్చు. దీనిద్వారా ఫోన్ దొంగతనానికి గురైనప్పుడు వెంటనే మీ మొబైల్లోని డేటాను తొలగించే వెసులుబాటు ఉంటుంది.
- https://support.google.com/accounts/answer/6160491?hl=en లింక్ ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్‌ను కనుగొనడం, లాక్ చేయడం, అన్‌లాక్ వంటివి చేయొచ్చు.
- https://www.google.com/android/ find ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్ ఎక్కడుందో కనుక్కోవచ్చు.
- iCloud.comలోకి వెళ్లి Find My iPhone ద్వారా ఐఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

