Hardik Pandya : దేశవాళీలో అదరగొట్టిన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఈసారి ఫొటోగ్రాఫర్లపై మండిపడ్డాడు. తన ప్రేయసి పట్ల కెమెరామెన్లు అసభ్యంగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేకపోయిన పాండ్యా.. మహిళల్ని గౌరవించం తెలియదా? అని ఆగ్రహం వెళ్లగక్కాడు. సెన్సేషనలిజం కోసం సెలబ్రిటీలను ఇబ్బందిపెట్టే చిల్లర వేషాలు మానుకోవాలని.. ఇకనైనా హుందాగా, బాధ్యతగా నడుచుకోవాలని హెచ్చరించాడు. అసలేం జరిగిందంటే..
హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ (Mahieka Sharma) ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఆమెను కొందరు ఫొటోగ్రాఫర్స్ వీడియో తీయగా అవి క్షణాల్లో నెట్టింట వైరలయ్యాయి. దాంతో, తన ప్రేయసిని అసభ్యకరంగా వీడియో తీయడంపై చిర్రెత్తుకొచ్చిన పాండ్యా పపరాజీస్కు సోషల్ మీడియా వేదికగా గట్టి హెచ్చరిక చేశాడు. ‘మీ చీప్ సెన్సేషనలిజం ఆపేయండ’ని మండిపడ్డాడు టీమిండియా స్టార్.

‘సెలబ్రిటీలం కావడంతో ప్రజల దృష్టిలో ఉంటామని, మా ప్రతిచర్యను వారు గమనిస్తారనే విషయాన్ని అర్ధం చేసుకోగలను. మేము ఎంచుకున్న జీవితలో ఇది ఒక భాగం. కానీ, ఈరోజు జరిగిన విషయంలో ఫొటోగ్రాఫర్లు హద్దులు దాటారు. బాంద్రాలోని రెస్టారెంట్ మెట్ల మీదుగా మహీకా నడుచుకుంటూ వస్తుంటే ఫొటోగ్రాఫర్ ఆమెను అసభ్యరీతిలో ఫొటో తీశాడు. ఏ మహిళ కూడా అలా ఫొటో దిగాలని అనుకోదు. ఆమె ఏదో వ్యక్తిగత పనిమీద వెళ్లితే.. అది కాస్త వీళ్లకు చీప్ సన్సేషనలిజంగా మారింది. ఇదంతా హెడ్లైన్ కోసమా? ఎవరు ఆ ఫొటో తీశారు? అనేది ఇక్కడ ముఖ్యం కాదు. మహిళలను గౌరవించాలి.
Hardik Pandya speaks up against invasive paparazzi culture, emphasizing that women deserve dignity and not every moment needs exposure.
📸: Hardik Pandya/ Instagram #HardikPandya #CricketTwitter pic.twitter.com/ZwmCcrgFXP
— InsideSport (@InsideSportIND) December 9, 2025
అంతేకాదు ప్రతిఒక్కరికి కొన్ని బౌండరీలు ఉంటాయి. రోజంతా కష్టపడే మీడియా సోదరులంటే నాకు గౌరవమే. నేను ఎల్లప్పుడూ మీకు సహరిస్తాను కూడా. అయితే.. కాసింత బుర్రతో పనిచేయండి. ఎందుకంటే.. ప్రతిదీ ఫొటో తీయాలనుకోవద్దు. మహిళలను వారు ఆమోదించనివిధంగా ఫొటో తీయొద్దు. ఇలాంటి విషయాల్లో మానవత్వంతో మెలగండి. ధన్యవాదాలు’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు ఆల్‌రౌండర్.
స్టన్నింగ్ లుక్ లో Hardik Pandya Girlfriend Mahieka Sharma #MahiekaSharma #HardikPandya #ReelTalk #OIUpdates #Oneindiatelugu pic.twitter.com/JrMwLxiRou
— oneindiatelugu (@oneindiatelugu) December 9, 2025