Basketball Tourney | మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 9: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర స్థాయి అండర్-19 బాలబాలికల బాస్కెట్‌బాల్ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం బాలికల విభాగం సెమీస్‌లో మహబూబ్‌నగర్ 28-26తో ఖమ్మంపై గెలువగా, మరో సెమీస్‌లో హైదరాబాద్ 34-10తో రంగారెడ్డిపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాయి.
బాలుర కేటగిరీ సెమీస్‌లో హైదరాబాద్ 26-20తో కరీంనగర్‌పై, రంగారెడ్డి 33-11తో వరంగల్‌పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించాయి. అంతకుముందు జరిగిన బాలుర విభాగంలో నల్లగొండపై 02-26 తేడాతో కరీంనగర్, మహబూబ్‌నగర్‌పై 06-28 తేడాతో హైదరాబాద్, నల్లగొండపై 00-27 తేడాతో రంగారెడి గెలుపొందాయి. కార్యక్రమంలో నిర్వాహకులు గోవర్ధన్‌రెడ్డి, ము కురం, సాధిక్, అరుణజ్యోతి పాల్గొన్నారు.