ఢిల్లీ: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి పాకిస్థానీలు గూగుల్‌లో తెగ వెతికారట.. రెండు నెలల క్రితం యూఏఈ వేదికగా ముగిసిన ఆసియా కప్‌లో భాగంగా తమతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తమ బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డ అభిషేక్ గురించి తెలుసుకోవడానికి పాకిస్థాన్ నెటిజనులు అత్యంత ఆసక్తి చూపించారట.
ఈ మేరకు గూగుల్ ‘మోస్ట్ సెర్చ్డ్ క్రికెటర్ ఇన్ పాకిస్థాన్ 2025’ జాబితాలో ఆ జట్టు స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, షహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ వంటి ప్లేయర్లను పక్కనబెట్టి అభిషేక్ శర్మ గురించి సెర్చ్ చేసినట్టు తేలింది. ఆసియా కప్‌లో బాగంగా అభిషేక్.. సూపర్-4 దశలో దాయాదితో పోరులో 39 బంతుల్లోనే 74 రన్స్ చేశాడు.