నేపియర్(న్యూజిలాండ్): ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన పాక్.. మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయింది. శనివారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 73 పరుగుల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. తొలుత కివీస్..మార్క్‌చాప్‌మన్(132) సెంచరీకి తోడు మిచెల్(76), అబ్బాస్(52) అర్ధసెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 344/9 స్కోరు చేసింది.
ఇర్ఫాన్‌ఖాన్(3/51), రవూఫ్(2/38), జావెద్(2/55) ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన పాక్ 44.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్(78), సల్మాన్ ఆగా(58) అర్ధసెంచరీలతో రాణించారు. నాథన్ స్మిత్(4/60) నాలుగు వికెట్లు పడగొట్టాడు.