Ban Vs Pak | రావల్పిండి: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్ ఘోరంగా తడబడింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దు కాగా, రెండో రోజైన శనివారం బంగ్లా స్టార్ స్పిన్నర్ మెహదీహసన్(5/61) ధాటికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సయిమ్ ఆయూబ్(58), కెప్టెన్ షాన్ మసూద్(57), సల్మాన్ ఆగా(54) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. పరుగుల ఖాతా తెరువకుండానే ఓపెనర్ షఫీక్(0)వెనుదిరుగగా, లోయార్డర్ తీవ్రంగా తడబడింది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ మెహదీహసన్ ఐదు వికెట్లు ఖాతాలో వేసుకోగా, తస్కిన్ అహ్మద్(3/57) రాణించాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లా 10 పరుగులు చేసింది.