ODI World Cup | వన్డే వరల్డ్ కప్ టోర్నీ-2023లో భాగంగా ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ముందు 283 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. చివరి ఓవర్ లో పాక్ ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్ వికెట్లు కోల్పోయింది. అంతకుముందు కెప్టెన్ బాబర్ ఆజం సహా ఐదు వికెట్లు కోల్పోవడంతో చిక్కుల్లో పడ్డ జట్టు పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను షాదాబ్ ఖాన్ 35, ఇఫ్తికార్ అహ్మద్ 32 చేపట్టారు.
అంతకుముందు 42వ ఓవర్ లో నూర్ అహ్మద్ వేసిన ఐదోబంతిని ఆడిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. మహ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పాకిస్థాన్ ఐదు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. అంతకుముందు పాకిస్థాన్ 40 ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి191 పరుగులు చేసింది. అంతకుముందు 10.1 ఓవర్లకు ఓపెనర్ ఇమాముల్ హక్.. జట్టు స్కోర్ 56 పరుగుల వద్ద అజ్మతుల్లా ఒమర్జాయి బౌలింగ్ లో నవీన్ ఉల్ హక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
22.3 ఓవర్లకు మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్.. నూర్ అహ్మద్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ కావడంతో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోర్ 110 పరుగులు. 24.4 ఓవర్లకు మహ్మద్ రిజ్వాల్.. నూర్ అహ్మద్ బౌలింగ్ లో ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 33.6 ఓవర్ల వద్ద మహ్మద్ నబీ బౌలింగ్‌లో షౌద్ షకీల్.. రషీద్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. పాక్ బ్యాటర్లలో అబ్దుల్లా షఫీక్ 58, షాద్ సఖీల్ 25, ఇమాముల్ హక్ 17 పరుగులు చేశారు.