రావల్పిండి: పాకిస్థాన్‌లో జరుగుతున్న ప్రెసిడెంట్ ట్రోఫీ గ్రేడ్-1 టోర్నమెంట్ ఫైనల్‌ను నిర్వాహకులు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. రంజాన్ మాసం కావడంతో ఆటగాళ్ల ఉపవాస దీక్షలకు ఇబ్బందులు తలెత్తకుండా మ్యాచ్ మొత్తాన్ని ఫ్లడ్‌లైట్ల వెలుతురు కింద రాత్రే ఆడిస్తున్నారు. పాక్ కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మొదలయ్యే మ్యాచ్ మరుసటి రోజు తెల్లవారుజామున 2:30 గంటలకు ముగుస్తుంది.
మూడు సెషన్లుగా జరిగే మ్యాచ్‌లో ఫస్ట్ సెషన్లో 20 నిమిషాల టీ బ్రేక్, రెండో సెషన్ తర్వాత డిన్నర్.. ఇక ఆఖరిదైన మూడో సెషన్ 2:30 దాకా కొనసాగుతోంది. పింక్ బాల్‌తో ఈ మ్యాచ్‌ను ఆడిస్తున్నారు. పాకిస్థాన్ టెలివిజన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను పింక్‌బాల్‌తో ఆడిస్తున్నారు.