ఫ్లోరిడా: పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్లో నిరాశజనక ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించినా ఇంకా అమెరికాలోనే ఉన్న పాక్ క్రికెటర్లలో రవూఫ్ ఒకడు కాగా.. మంగళవారం అతడు తన భార్యతో కలిసి ఫ్లోరిడా వీధుల్లో చక్కర్లు కొడుతుండగా అటుగా వచ్చిన కొంతమంది అభిమానులతో గొడవపడ్డాడు.
గొడవ వద్దని భార్య వారిస్తున్నా వినకుండా వారిపై చిందులు తొక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రపంచకప్ ఓటమితో పాక్ క్రికెటర్లపై అభిమానులు ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.