కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్కు వరుణుడు తీవ్ర అంతరాయం కల్గించడంతో 25 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాలేదు. కివీస్ టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించగా 25 ఓవర్లలో పాక్ 5 వికెట్ల నష్టానికి 92 రన్స్ చేసింది.
కానీ ఆ జట్టు ఇన్నింగ్స్లో మూడుసార్లు వర్షం ఆటకు అంతరాయం కల్పించింది. ఈ మ్యాచ్ రద్దవడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా తర్వాత సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది.