మిచెల్ హాఫ్ సెంచరీ.. పాక్ టార్గెట్ 153
Pakistan target:పాకిస్థాన్‌కు 153 రన్స్ టార్గెట్ విసిరింది న్యూజిలాండ్. టీ20 వరల్డ్‌కప్ ఫస్ట్ సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసింది. డారెల్ మిచల్ టీ20ల్లో మూడవ హాఫ్ సెంచరీ నమోదు చే
సిడ్నీ: పాకిస్థాన్‌కు 153 రన్స్ టార్గెట్ విసిరింది న్యూజిలాండ్. టీ20 వరల్డ్‌కప్ ఫస్ట్ సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసింది. డారెల్ మిచల్ టీ20ల్లో మూడవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 32 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 రన్స్ చేశాడతను. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నా.. అతను సింగిల్స్ తీస్తూ ఆచితూచి ఆడాడు. నాలుగో వికెట్‌కు మిచెల్, విలియమ్సన్ 68 రన్స్ జోడించారు. నిజానికి ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చారు. ఫీల్డింగ్‌లోనూ పాక్ ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. కివీస్ బ్యాటర్లలో మిచెల్ 53(నాటౌట్), విలియమ్సన్ 46, కాన్వే 21, నీషమ్ 16(నాటౌట్) రన్స్ చేశారు.
New Zealand have set a target of 153 for Pakistan 🏏
Will it be enough?#T20WorldCup | #NZvPAK | 📝: https://t.co/LSzHXLyyRN pic.twitter.com/G2gTK1hTWK
— ICC (@ICC) November 9, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

