హైదరాబాద్: అసలే చాంపియన్స్ ట్రోఫీ. అందులోనూ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు. తమ జట్టే గెలవాలని రెండు దేశాల అభిమానుల (Pakistan Fan) ఆరాటం. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆగటగాళ్లను ఉత్తేజపరుస్తూ మద్దతుగా నిలుస్తుంటారు. తమ జట్టు గెలుస్తుంటే చూసి ఉప్పొంగిపోతుంటారు. అయితే వారి టీమ్ ఓడిపోవడానికి కొందరు తట్టుకోలేకపోతుంటారు. కానీ, ఓ అభిమాని మాత్రం తన జట్టు ఓడిబాటలో ఉండటంతో ప్లేట్ ఫిరాయించాడు. గెలుపుబాటలో పయనిస్తున్న టీమ్ జెర్సీ వేసుకుని తానూ ఆనందంలో మునిగిపోయాడు. దుబాయ్ వేదికగా ఇండియా vs పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోచేసుకున్నది. ఈ దృష్యాన్ని తమ కెమెరాల్లో బంధించిన తోటి ప్రేక్షకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ అవుతున్నది. పాక్ అభిమాని చేసిన పని నెట్టింట నవ్వులు పూయిస్తున్నది.
पाकिस्तानी के फैन को हम लोगों ने भारत जर्सी पहना दिया ! #INDvsPAKlive #INDvsPAK #ViratKohli𓃵 #virat pic.twitter.com/Mx1w0Ymhy7
— ANSHUL YADAV (@Anshulydv02) February 24, 2025
చాంపియన్స్ టోఫ్రీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఐసీసీ టోర్నీలలో పాక్‌ను చిత్తుచేసే అలవాటును కొనసాగిస్తూ దాయాదుల పోరులో మరోసారి భారత్‌దే పైచేయి సాధించింది. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో రిజ్వాన్ సేనకు ఘోర పరాభవం తప్పలేదు. ఆల్‌రౌండ్ షోతో పాక్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించిన టీమ్ఇండియా.. సెమీస్ బెర్తును ఖాయం చేసుకోగా వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి ఆతిథ్య పాక్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోయే ఆడే రన్మిషీన్, ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ (111 బంతుల్లో 100 నాటౌట్, 7 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగి మరో మరుపురాని ఇన్నింగ్స్ ఆడటంతో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలోనే పూర్తిచేసిన విషయం తెలిసిందే.
కాగా, మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ఓ పాక్ అభిమాని.. తమ జట్టు ఓటమి అంచున ఉండటంతో అప్పటివరకు తాను వేసుకున్న పాకిస్థాన్‌ను టీషర్ట్‌ను పైనుంచి టీమ్ఇండియా జెర్సీని వేసుకున్నాడు. అక్కడే ఉన్నవారు దీనిని చూసి నవ్వుకున్నారు. తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో షేర్చేశారు. మరో పాక్ అభిమాని అయితే విరాట్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పాకిస్థాన్ జెర్సీపై విరాట్ అని రాసుకున్నాడు.
A true cricket fan knows no boundaries! 🇮🇳🇵🇰 This Pakistan fan proudly wears a Virat Kohli jersey under a Pakistan jersey, showing respect for the 🐐. Cricket unites beyond rivalries! ❤️🏏 #INDvsPAK #ViratKohli #CricketUnites pic.twitter.com/V7WqRnKkdI
— Veera Raghava (@VeeraRaghavaNTR) February 23, 2025