రావల్పిండి: పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండిలో ఇవాళ జరగాల్సిన గ్రూప్ ఏ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయ్యింది. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో రెండు జట్లు చెరో పాయింట్ లభించింది. ఆతిథ్యదేశం పాకిస్థాన్ గ్రూపులో ఒక పాయింట్‌తో నాలుగవ స్థానంలో నిలిచింది. ఒక్క మ్యాచ్ కూడా నెగ్గకుండానే టోర్నీ నుంచి పాక్ నిష్క్రమించింది.
న్యూజిలాండ్, ఇండియా చేతిలో ఓడిన పాక్ జట్టు.. తన చివరి మ్యాచ్‌లో సత్తా చాటనుకున్నది. కానీ వర్షం వల్ల ఆ అవకాశం దక్కలేదు. 2017లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచి, ఈ సారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు టోర్నీలో చేదు అనుభవం మిగిలింది. పాకిస్థాన్ కన్నా ఉత్తమ నెట్ రన్‌రేట్ కలిగి ఉన్న బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ ఏలో మూడవ స్థానంలో నిలిచింది.
Rain plays spoilsport as #PAKvBAN is called-off in Rawalpindi ⛈️
More ➡️ https://t.co/sH1r63WCCD pic.twitter.com/hFe6ETayTG
— ICC (@ICC) February 27, 2025
రావల్పిండిలో బుధవారం రాత్రి మొత్తం వర్షం కురిసింది. దీంతో మైదానం చిత్తడిగానే ఉన్నది. పలుమార్లు ఇవాళ అంపైర్లు .. పిచ్‌ను పరిశీలించినా.. ఆటకు అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. గ్రూపు ఏ నుంచి న్యూజిలాండ్, ఇండియా జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఆటగాళ్లలో అనుభవం లేకపోవడం వల్లే టోర్నీ నుంచి పాకిస్థాన్ త్వరగా నిష్క్రమించినట్లు తాత్కాలిక చీఫ్ సెలెక్టర్ అకీబ్ జావెద్ తెలిపారు.
చాంపియన్స్ ట్రోఫీ గ్రూపు బీ నుంచి ఇంగ్లండ్ జట్టు ఔట్ అయ్యింది. అయితే సెమీస్‌లోకి వెళ్లేందుకు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా పోటీపడుతున్నాయి.