Shoaib Akhtar | ఇదేం తెలివిరా బాబూ.. షోయబ్ అక్తర్ టాక్ షోపై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు
Shoaib Akhtar | పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇప్పుడు యాంకర్‌గా మారిపోయాడు. హోస్ట్‌గా మారి ఓటీటీ ప్లాట్ఫామ్లో అదరగొడుతున్నాడు. కానీ ఈ టాక్ షో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి కారణంగా ఈ షోకు తాజాగా హాజరైన గెస్ట్ నిదా యాసిర్.
Shoaib Akhtar | పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇప్పుడు యాంకర్‌గా మారిపోయాడు. హోస్ట్‌గా మారి ఓటీటీ ప్లాట్ఫామ్లో అదరగొడుతున్నాడు. కానీ ఈ టాక్ షో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి కారణంగా ఈ షోకు తాజాగా హాజరైన గెస్ట్ నిదా యాసిర్. టాక్ షోలో అడిగిన చిన్న ప్రశ్నకు కూడా సమాధానాలు చెప్పలేక బిత్తరపోవడంతో ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. నీకు తెలివికి దండం అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉర్ఫూఫ్లిక్స్లో షోయబ్ అక్తర్ షో పేరిట ఈ షో నడుస్తోంది. దీనికి పాకిస్థానీ నటి, మోడల్ నిదా యాసిర్ గెస్ట్‌గా వచ్చింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముందుగా నిదా యాసిర్‌ను షోయబ్ అక్తర్ ఓ ప్రశ్న అడిగాడు. 1992 వరల్డ్‌కప్‌ను పాకిస్థాన్ ఏ ఏడాది గెలిచిందని షోయబ్ అక్తర్ అడిగాడు. ప్రశ్నలోనే సమాధానం ఉన్నప్పటికీ నిదా యాసిర్ తెగ కష్టపడిపోయింది. ఆన్సర్ తెలియక పక్కన ఉన్న మరో సెలబ్రెటీ సహాయం కూడా తీసుకుంది. అయినా 2006 అంటూ తప్పుడు సమాధానం చెప్పింది. ఈ సమాధానం విని నిదా యాసిర్ తెలివికి అంతా నవ్వుకున్నారు. ఇంతలోనే మరోసారి ప్రశ్నను మార్చి అడిగాడు. 2009 టీ20 వరల్డ్ కప్‌ను పాక్ ఎప్పుడు గెలుచుకుందని మళ్లీ అడిగాడు. కానీ దీనికి పాత సమాధానమే చెప్పింది. 1992 అంటూ ఠక్కున చెప్పేసింది. ఈ సమాధానం విని నిదా యాసిర్‌కు ఇంత తెలివి ఉందా అంటూ తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత నవ్వుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి.
Let the memes begin! pic.twitter.com/QejWZbiLRU
— 𝓢𝓮𝓱𝓻𝓲𝓼𝓱 🇵🇰 (@itsmeSehrish) February 14, 2023
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిదా యాసిర్ తెలివిని చూసి జనాలు నవ్వుకుంటున్నారు. దీంతో పాటు ట్రోల్స్ చేస్తున్నారు. నీ తెలివికి దండం అంటూ ఆడుకుంటున్నారు. అయితే కొంతమంది ఇది కావాలని చేసినది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంత బేవకూఫ్గా ఎవరైనా ఉంటారా.. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇది ప్రీప్లాన్డ్ స్క్రిప్టు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Read More :
పులి బారి నుంచి తప్పించుకున్న చిరుత..క్లైమాక్స్‌లో ట్విస్ట్
Underwater Kiss | ప్రేమికుల రోజున లాంగ్ కిస్.. గిన్నిస్ రికార్డుల్లో జంట.. వీడియో వైరల్
Viral video | నీళ్ల డబ్బాలు దించడంలో తల్లికి సాయపడుతున్న బుడతడు.. చూస్తే నవ్వకుండా ఉండలేరు..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

