Underwater Kiss | ప్రేమికుల రోజున లాంగ్ కిస్.. గిన్నిస్ రికార్డుల్లో జంట.. వీడియో వైరల్
Underwater Kiss | ఏడాదికి ఒక్కసారి వచ్చిపోయే వాలెంటైన్స్ డే కోసం ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ఒక్కో ఏడాది ఒక్కోలా ఆ రోజును జరుపుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఎక్కువ మంది రొమాంటిక్‌గా వాలెంటైన్స్ డే ను ఎంజాయ్ చేయాలనుకుంటారు.
Valentine’s Day: ఏడాదికి ఒక్కసారి వచ్చిపోయే వాలెంటైన్స్ డే కోసం ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ఒక్కో ఏడాది ఒక్కోలా ఆ రోజును జరుపుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఎక్కువ మంది రొమాంటిక్‌గా వాలెంటైన్స్ డే ను ఎంజాయ్ చేయాలనుకుంటారు. లేదంటే లవర్స్ ఇద్దరూ ఒకరికొకరు ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవాలని భావిస్తారు. తాజాగా ఓ జంట కూడా అలాంటి వెరైటీ ఆలోచనే చేసింది. ఈసారి వాలెంటైన్స్ డేను అసాధారణంగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది.
అనుకున్నట్లుగానే వాలెంటైన్స్ డే జరుపుకుని ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఇంతకూ ఆ జంట ఏం చేసిందని ఆలోచిస్తున్నారా..? ఏం లేదండీ 4 నిమిషాల 6 సెకన్ల పాటు ముద్దు పెట్టుకుంది అంతే. ఓస్.. అంతేనా అని తేలిగ్గా తీసిపారేయకండి. వాళ్లు ముద్దు పెట్టుకుంది చెట్టు కిందనో, గుట్ట మీదనో, పట్టుపరుపులోనో కాదు.. నీటి అడుగున. నీటి అడుగున 4 నిమిషాలకుపైగా ఊపిరి బిగబట్టి ముద్దు పెట్టుకోవడం అంటే మామూలు మాటా మరి. కాదు గదా.. అందుకే ఆ జంట గిన్నిస్ రికార్డు సృష్టించింది.
దక్షిణాఫ్రికాకు చెందిన బెత్ నీల్, కెనడాకు చెందిన మైల్స్ క్లౌటియర్ ప్రేమికులు. ప్రస్తుతం ఇద్దరూ దక్షిణాఫ్రికాలో ఉంటున్నారు. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే రోజున నీటి అడుగులో ఎక్కువసేపు ముద్దు పెట్టుకుని గిన్నిస్ రికార్డు సృష్టించాలని వారు నిర్ణయించుకున్నారు. అందుకోసం గత కొన్ని వారాల నుంచి మాల్దీవ్స్‌లో బాగా సాధనచేశారు. ఇవాళ మాల్దీవ్స్‌లోనే నీలి రంగు దస్తుల్లో ఓ పూల్ అడుగు భాగంలో మోకాళ్లపై కూర్చుని ఏకంగా 4 నిమిషాల 6 సెకన్ల పాటు ముద్దు పెట్టుకున్నారు. దాంతో ఇప్పటివరకు 3 నిమిషాల 24 సెకన్లుగా ఉన్న గిన్నిస్ రికార్డు బద్ధలైంది.
ఈ రికార్డు బ్రేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ వీడియోను తన అధికారిక ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు లైకులతో ముంచెత్తుతున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

