Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Sai Durga Tej | మెగా హీరో, సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. గురువారం హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
Sai Durga Tej | మెగా హీరో, సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. గురువారం హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులు హాజరై కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. నిశ్చితార్థం అనంతరం సాయి దుర్గా తేజ్ సోషల్ మీడియాలో చేసిన తొలి పోస్ట్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. తనకు కాబోయే భార్య కిరణ్మయితో కలిసి దిగిన అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆమెపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. అంతేకాకుండా ‘ఐ లవ్ యూ’ అంటూ ఓ చిన్న ప్రేమలేఖను కూడా రాశారు. ఈ పోస్ట్‌తో తన ప్రేమ, పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉన్న సాయి దుర్గా తేజ్, కిరణ్మయి మధ్య పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సాయి దుర్గా తేజ్‌కు కాబోయే భార్య కిరణ్మయికి సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని సమాచారం. ఆమె కుటుంబ నేపథ్యం, వృత్తి, ఇతర వ్యక్తిగత వివరాలను ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆమె సాయి దుర్గా తేజ్‌కు చిన్ననాటి స్నేహితురాలని తెలుస్తోంది. చిన్ననాటి పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధానికి దారితీస్తుండటంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
సమాచారం ప్రకారం, డిసెంబర్ 10న హైదరాబాద్‌లో సాయి దుర్గా తేజ్, కిరణ్మయి వివాహం జరగనుంది. పెళ్లి అనంతరం సినీ ప్రముఖులు, సన్నిహితుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా కుటుంబంతో పాటు అల్లు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అలాగే హీరో మంచు మనోజ్, మౌనికా రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ, హర్ష చెముడు, దర్శకుడు వెంకీ కుడుముల, హర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొని కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు సంబంధించిన తేదీ, తాజా వివరాలను చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

