Viral video | నీళ్ల డబ్బాలు దించడంలో తల్లికి సాయపడుతున్న బుడతడు.. చూస్తే నవ్వకుండా ఉండలేరు..!
ఏడాది, రెండేళ్ల వయసు పిల్లలు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ముద్దుచేస్తే మీద కూర్చుని బుడ్డబుడ్డ చేతులతో ముక్కూ మూతీ అని చూడకుండా కొడుతూనే ఉంటారు. వదిలేస్తే ఇంట్లో తమకు అందిన ఏ ఒక్క వస్తువును వదలకుండా పీకి పారేస్తుంటారు.
Viral video: సాధారణంగా ఏడాది, రెండేళ్ల వయసు పిల్లలు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ముద్దుచేస్తే మీద కూర్చుని బుడ్డబుడ్డ చేతులతో ముక్కూ మూతీ అని చూడకుండా కొడుతూనే ఉంటారు. వదిలేస్తే ఇంట్లో తమకు అందిన ఏ ఒక్క వస్తువును వదలకుండా పీకి పారేస్తుంటారు. ఫోన్ చేతికిస్తే దాని ఖరీదు ఎంతయినా సరే విసిరికొడతారు. పేపర్ చేతికిస్తే అది కరెన్సీ నోటైనా సరే చింపిపారేస్తారు. ఇలా అల్లరి చేస్తూ అమ్మలకు చికాకు తెప్పిస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం చిన్నారులు చేసే పనులు తెగ ముద్దొస్తాయి. పెద్దవాళ్లు చేసే పనులను చూస్తూ వాళ్లు కూడా అచ్చం అలాగే చేయబోతారు.
తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా తన ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. ఓ మహిళ వాహనం నుంచి నీళ్ల డబ్బాలను కిందకు దించుతుండగా.. బుడిబుడి నడకలు నడుస్తున్న ఆమె కొడుకు ఆ డబ్బాలను ఒక్కొక్కటిగా లోపలికి మోస్తూ సాయపడుతున్నాడు. ఈ క్రమంలో ఆ బుడతడు పడుతున్న అవస్థ చూస్తే నవ్వకుండా ఉండలేరు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. వేల మంది లైక్ చేస్తున్నారు. బుడతడి తపనను మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురుస్తున్నది. మరింకెందుకు ఆలస్యం ఈ కింది వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
उम्र और कद भले छोटा है,
पर “मदद की भावना” बहुत उंची है.माता-पिता ने नायाब हीरा ताराशा है… pic.twitter.com/ySun6A5hEC
— Dipanshu Kabra (@ipskabra) February 14, 2023
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

