Naseem Shah : స్వదేశంలో శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందే పాకిస్థాన్ యువ పేసర్ నసీం షా (Naseem Shah)కు పెద్ద షాక్ తగిలింది. అతడి పూర్వీకులకు సంబంధించిన ఇంటిపై కొందరు కాల్పులకు తెగబడ్డారు. మంగళవారం ఖైబర్ పఖ్తుంక్వా (Khyber Pakhtunkhwa)లోని ఇంటిపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటన తెలియగానే షాక్‌కు గురయ్యాడీ స్పీడ్‌స్టర్. అయితే.. కాల్పుల్లో ఎవరూ గాయపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అతడు జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
దిర్ జిల్లాలోని ఖైబర్ పఖ్తుంక్వాలోని పూర్వీకుల ఇంటిపై కొందరు కాల్పులు జరిపారు. రావల్పిండిలో పాక్, శ్రీలంక మధ్య తొలి వన్డే సన్నద్ధతలో ఉన్న పేసర్ నసీం షా ఈ విషయం తెలిసి అందోళనకు గురయ్యాడు. వెంటనే సన్నిహితులకు ఫోన్ చేసి ఏం జరిగింది? తాజా పరిస్థితి ఏంటీ? అని అతడు వాకబు చేశాడు. అంతా ఓకే. ఎవరికీ గాయాలు కాలేదు అని చెప్పడంతో అతడు మ్యాచ్‌పై దృష్టిసారించాడు.
Shame on the spineless rats who sprayed bullets at Naseem Shah’s home in Lower Dir Gate and shredded the car, but the family was untouched. Alhamdulillah…..
This man, 150kph heat, terrifies batsmen worldwide, yet cowards target his doorstep? Pakistan stands taller than your… pic.twitter.com/0enHv6qLGe— Hunain Fatima (@hunainfatima_) November 11, 2025
నసీం కుటుంబం ఒకప్పుడు ఖైబర్ పఖ్తుంక్వాలో ఉండేది. కానీ, అతడి క్రికెట్ కోచింగ్, మ్యాచ్‌ల కోసం ఇస్లామాబాద్‌లో స్థిరపడింది. దాంతో.. తమ సన్నిహితులకు ఏమైనా జరిగి ఉంటుందేమోనని పేసర్ కంగారుపడ్డాయి. పాక్ జట్టులోని కొందరు ఆటగాళ్లు ఖైబర్ ప్రాంతానికి చెందినవారు. అయితే.. నసీం పూర్వీకుల ఇంటిపై కాల్పులకు కారణం ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. అక్కడ నివసించే కొన్ని తెగల మధ్య విభేదాలు ఉన్నాయని సమాచారం.