IPL 2026 | ఐపీఎల్ వేలానికి ముందు ఆటగాళ్ల బదిలీ విషయంలో చర్చలు జరుపుతున్నాయి. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‌ను తీసుకోవాలని చెన్నై జట్టు భావిస్తున్నది. ఈ విషయంలో రెండు ఫ్రాంచైజీల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. రెండుజట్ల తొలుత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు ఒప్పందం గురించి తెలియజేయాల్సి ఉంటుంది. ముగ్గురు ఆటగాళ్ల పేర్లను అందిస్తాయి. గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదిస్తేనే ఒప్పందం ఖరారవుతుంది. మీడియా నివేదికల ప్రకారం.. సంజు శాంసన్ సీఎస్కే జట్టులోకి వెళ్తే ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్లో ఎవరో ఒకరు రాజస్థాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది.
ఇటీవల ఇద్దరు అసాధారణంగా రాణించారు. శాంసన్స్ 2013లో రాజస్థాన్ రాయల్స్‌లో చేరాడు. అప్పటి నుంచి ఆ ఫ్రాంచైజీలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. 19 సంవత్సరాల వయస్సులో జట్టులో చేరిన శాంసన్స్ 2014 సీజన్‌కు ముందు నిలుపుకుంది. 2016-17లో జట్టుపై సస్పెన్షన్ వేటు తర్వాత.. 2018లో తిరిగి వచ్చి 2021లో కెప్టెన్ అయ్యాడు. శాంసన్స్ కెప్టెన్సీలో రాజస్థాన్ 2022 ఐపీఎల్ ఫైనల్ ఆడింది. సంజు 67 మ్యాచులు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 33 మ్యాచుల్లో గెలిచి.. 33 మ్యాచులు ఓడిపోయాడు. 2024 ఐపీఎల్ సీజన్లో అత్యంత విజయమైన సీజన్ ఇదే. 48.27 సగటుతో 531 పరుగులు చేశాడు. 153.47 స్ట్రయిక్ రేట్‌తో రాణించాడు. 2025 సీజన్లో రూ.18కోట్లకు రాజస్థాన్ శాంసన్స్ను రీటైన్ చేసుకుంది. కానీ, గాయం కారణంగా సీజన్ మధ్యలో నిష్క్రమించాల్సి వచ్చింది.
రాజస్థాన్ జట్టు సైతం తొమ్మిదో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ జట్టు తరఫున ఇప్పటివరకు రాజస్థాన్ తరఫున అనేక రికార్డులు నెలకొల్పాడు. 4,027 పరుగులు, 25సార్లు యాభై-ప్లస్ స్కోర్ సాధించడంతో పాటు 149 క్యాచ్‌లు అందుకున్నాడు. గత సీజన్ తర్వాత కొత్త జట్టులోకి మారాలనే కోరికను వ్యక్తం చేశాడు. అయితే, శాంసన్‌ను చెన్నైకి ఇస్తే.. జడేజాను ఇవ్వాలని రాజస్థాన్ కోరినట్లుగా పలు నివేదికలు తెలిపాయి. సీఎస్కే జట్టుకు జడేజా వెన్నెముకగా నిలిచాడు. 2012 నుంచి జట్టులో భాగమైన జడేజా.. మూడు ఐపీఎల్ టైటిల్స్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2023 ఫైనల్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 254 మ్యాచ్‌లు ఆడిన జడేజా.. 143 వికెట్లు పడగొట్టాడు. జడ్డు ఐపీఎల్ కెరీర్ 2008లో రాజస్థాన్‌తో ప్రారంభమైంది. ఆ సమయంలో జడేజా వయసు 19 ఏళ్లు. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. 2023లో రూ.18.5కోట్లతో చెన్నై రీటైన్ చేసుకుంది. ఆ సీజన్లో ప్రదర్శన సాధారణంగా ఉండగా.. ఈ ఏడాది మళ్లీ తక్కువ ధరకు తీసుకుంది.