Pakistan Head Coach | గిఫ్ట్ ఇచ్చినందుకు భారత జట్టుకు కృతజ్ఞతలు.. పాక్ ఓటమిపై హెడ్‌కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pakistan Head Coach : : ఆసియా కప్(Asia Cup 2023) సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ జట్టు(Team India) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)కు చుక్కలు చూపించింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అయితే.. టీమిండియా చేతిలో పరాజయం తమకు ఓ మేలుకొలుపు లాంటిదని పాక్ హెడ్‌కోచ్...
Pakistan Head Coach : : ఆసియా కప్(Asia Cup 2023) సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ జట్టు(Team India) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)కు చుక్కలు చూపించింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అయితే.. టీమిండియా చేతిలో పరాజయం తమకు ఓ మేలుకొలుపు లాంటిదని పాక్ హెడ్‌కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్(Grant Bradburn) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు పాక్‌ను చిత్తుగా ఓడించి గిఫ్ట్ ఇచ్చినందుకు భారత జట్టకు కృతజ్ఞతలు చెప్పాడు.
‘మేము ఈ మూడు నెలల్లో ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు మేము మేల్కోవడానికి ఇదొక మంచి అవకాశం. ఈ రెండు రోజుల్లో భారత్ మాకు ఇచ్చిన గిఫ్ట్‌కు మేము రుణపడి ఉంటాం. వరల్డ్ కప్ ముందు ఈ టోర్నీలో భారత జట్టుతో ఆడడం మాకు ఎంతో పనికొస్తుంది. ముఖ్యంగా వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో ఆడే అవకాశం తరచుగా వస్తోంది. భారత్‌లో ఉన్న పరిస్థితులే శ్రీలంకలో ఉన్నందున మాకు ఇది లాభించనుంది’ అని ఇండియా, పాక్ మ్యాచ్ అనంతరం గ్రాంట్ వెల్లడించాడు.
పాక్ హెడ్‌కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్

ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా దాయాది పాకిస్థాన్‌పై బంపర్ విక్టరీ కొట్టింది. మొదట విరాట్ కోహ్లీ(122 నాటౌట్ : 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కేఎల్ రాహుల్(111 నాటౌట్ : 106 బంతుల్లో12 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో విజృంభించారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) 5 వికెట్లతో పాక్ భరతం పట్టాడు. దాంతో, ఇండియా 228 రన్స్ తేడాతో గెలుపొందింది. దాంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
కోహ్లీ(122 నాటౌట్), రాహుల్(111 నాటౌట్)

రిజర్వ్ డేకు ముందు ఓపెనర్లు రోహిత్ శర్మ(56), వుభ్మన్ గిల్ (58) అర్ధ సెంచరీలు కొ ట్టారు. వీళ్లిద్దరూ పాక్ పేస్ త్రయాన్ని చితకబాదడంతో ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, రాహుల్ ఈజీగా పరుగులు సాధించారు. దాంతో, భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 356 రన్స్ కొట్టింది.
ఇవి కూడా చదవండి
Babar Azam | మూడోసారి ఐసీసీ అవార్డు గెలిచిన బాబర్
Rohit Sharma | వన్డేల్లో 10 వేల పరుగులు.. దిగ్గజాల రికార్డు బద్ధలు కొట్టిన రోహిత్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

