Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) భారీ రికార్డు సాధించాడు. వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని అతను సొంతం చేసుకోనున్నాడు. ఆసియా కప్(Asia Cup 2023)లో శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డు నెలకొల్పాడు. కసున్ రజిత(Kasun Rajitah) ఓవర్లో లాంగాఫ్‌లో భారీ సిక్స్ బాది 10 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు.
దాంతో, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ క్లబ్లో చేరిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. హిట్‌మ్యాన్ 241 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల రన్స్ చేశాడు. కోహ్లీ మాత్రం 205 ఇన్నింగ్స్‌ల్లోనే 10 వేల పరుగుల మైలురాయికి చేరాడు.
ROHIT SHARMA CROSSES 10,000 ODI RUNS 🙌
India’s skipper crosses a legendary milestone 🔥 #SLvIND LIVE 👉 https://t.co/yjh54eDXBm#AsiaCup2023 pic.twitter.com/lSXRkJpzSr
— ESPNcricinfo (@ESPNcricinfo) September 12, 2023
అంతేకాదు భారత జట్టు తరఫున ఈ ఫీట్ సాధించిన ఆరో క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు సచిన్ టెండూల్కర్(18,426), విరాట్ కోహ్లీ(13,024) సౌరభ్ గంగూలీ(11,363), రాహుల్ ద్రవిడ్(10,889), ఎంఎస్ ధోనీ(10,773)లు ఈ ఫీట్ సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయికి చేరిన 15వ ఆటగాడిగా హిట్‌మ్యాన్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
Players with 10,000 ODI runs for India:
Sachin Tendulkar
Virat Kohli
Sourav Ganguly
Rahul Dravid
MS Dhoni
ROHIT SHARMA 🔥 #SLvIND LIVE 👉 https://t.co/yjh54eDXBm#AsiaCup2023 pic.twitter.com/fpC4Jg9LZh— ESPNcricinfo (@ESPNcricinfo) September 12, 2023
శ్రీలంక దిగ్గజం కుమార సంగర్కర(14,234), ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్(13,704), సనత్ జయసూర్య(13,430), మహేల జయవర్దనే(12,650), పాక్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్(11,739), దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్(11,579), వెస్టిండీస్ మాజీ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్(10,480), బ్రియాన్ లారా(10,405), లంక మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్(10,290)లు వన్డేల్లో 10 వేల పరుగుల క్లబ్లో చోటు దక్కించుకున్నారు.
ఇప్పటి వరకు 248 వన్డే మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 30 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు బాదాడు. అంతేకాదే మూడు సార్లు వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ కూడా అతనే. వన్డేల్లో రోహిత్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264.