Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam ) మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ ఆగస్టు నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ICC Player oF The Month) అవార్డు గెలుచుకున్నాడు. విశేషం ఏంటంటే.. బాబర్ ఈ అవార్డు అందుకోవడం ఇది మూడోసారి. వరల్డ్ నం 1 క్రికెటర్ అయిన బాబర్ శ్రీలంక వేదికగా అఫ్గనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దుమ్మురేపాడు. మహిళల విభాగంలో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ అరెలే కెల్లె(Arlene Kelly) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతగా నిలిచింది.
ఆసియా కప్(Asia Cup 2023) గ్రూప్ దశలో నేపాల్‌పై విధ్వంసక శతకం బాదాడు. బాబర్ పోలింగ్‌లో ఎక్కువ ఓట్లతో ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు. దాంతో, పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్(Shadab Khan), వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్(Nicholas Pooran)లకు నిరాశే మిగిలింది.
మహిళల విభాగంలో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ అరెలే కెల్లె(Arlene Kelly) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతగా నిలిచింది. నెదర్లాండ్స్‌తో ఈ మధ్యే ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో కెల్లే అద్భుతంగా రాణించింది. ఏకంగా 10 వికెట్లు తీసింది. మహిళల క్రికెట్లో అది కూడా ఒక బౌలర్ 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అందులో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. అందుకుగానూ ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ అవార్డు కోసం ముగ్గురు ఆల్‌రౌండర్లు పోటీ పడ్డారు. మలేషియా నుంచి తొలిసారిగా ఓ క్రికెటర్ ఈ అవార్డు బరిలో నిలిచింది. ఆమె పేరు ఐన్నా అమిజాహ్ హషీం(Ainna Hamizah Hashim). నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ ఇరిస్ జ్విల్లింగ్(Iris Zwilling)లు నామినేషన్ దక్కించుకున్నారు.