Vriat Kohli – Rohit Sharma : భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Vriat Kohli) మరో రికార్డు నెలకొల్పారు. సూపర్ హిట్ జోడీగా పేరొందిన వీళ్లు వన్డేల్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 5వేల పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఆసియా కప్(Asia Cup 2023)లో శ్రీలంకతో ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో కోహ్లీ, హిట్‌మ్యాన్ ఈ ఫీట్ సాధించారు. వీళ్లిద్దరూ 86 ఇన్నింగ్స్‌ల్లోనే 5 వేల రన్స్ కొట్టడం విశేషం. ఇందులో 18 సెంచరీ, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
దాంతో, గతంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాళ్లు గోర్డన్ గ్రీనిడ్గే(Gordon Greenidge), దేస్మాండ్ హేన్స్(Desmond Haynes) నెలకొల్పిన రికార్డు బద్ధలైంది. వీళ్లు 97 ఇన్నింగ్స్‌ల్లో 5 వేల పరుగులు జోడించారు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్లు మాథ్యూ హేడెన్( Matthew Hayden), ఆడం గిల్‌క్రిస్ట్(Adam Gilchrist)లు 104 ఇన్నింగ్స్‌ల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శ్రీలంక లెజెండ్స్ కుమార సంగక్కర(Kumar Sangakkara), తిలకరత్నే దిల్షాన్(Tillakaratne Dilshan)లు 105 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు.