కరాచీ : ఐపీఎల్‌తో సమాంతరంగా పాకిస్థాన్‌లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడుతున్న పలువురు విదేశీ క్రికెటర్లు ఈ లీగ్‌తో పాటు పాక్ నుంచి తట్టాబుట్టా సర్దుకునేందుకు సిద్ధమవుతున్నారు. పాక్‌లో ఉన్న ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్‌తో భారత్ విరుచుకుపడ్డ నేపథ్యంలో పీఎస్ఎల్లో ఆడుతున్న విదేశీ క్రికెటర్లు ఇంటికెళ్లేందుకు యత్నిస్తున్నట్టు ‘ది టెలిగ్రాఫ్’ కథనం వెల్లడించింది.
ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ వీన్స్, టామ్ కరన్, సామ్ బిల్లింగ్స్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లె, లూక్ వుడ్, టామ్ కోహ్లర్తో పాటు అదే దేశానికి చెందిన కోచ్‌లు రవి బొపారా, అలగ్జాండ్ర హర్ట్లీ.. ఆయా ఫ్రాంచైజీలను వీడాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక భారత్ ప్రయోగించిన డ్రోన్ దాడులలో ఒకటి రావల్పిండి స్టేడియాన్ని ఢీకొట్టడంతో గురువారం పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేశారు.