హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా ఇంటర్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల టెన్నిస్ టోర్నీలో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన సెమీస్‌లో ఓయూ 2-1 తేడాతో మహర్షి దయానంద్ యూనివర్సిటీ(హర్యానా)పై విజయం సాధించింది.
తొలుత జరిగిన సింగిల్స్ పోరులో సౌమ్య(ఓయూ) 6-7(5-7), 1-6తో అంజలిరాజ్ చేతిలో ఓటమిపాలైంది. రెండో సింగిల్స్‌లో సామ చెవికారెడ్డి 6-1, 6-2తో నాన్సిపై అలవోకగా గెలిచింది. డబుల్స్‌లో సౌమ్య, చెవిక ద్వయం 7-5, 7-5తో అంజలిరాజ్, నాన్సి జోడీపై గెలువడంతో ఓయూ ఫైనల్ బెర్తు ఖరారైంది.