Wasim Jaffer : ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ రెండో వన్డేలో శ్రీలంకపై కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. ఐదో స్థానంలో రాహుల్ చక్కగా సరిపోతాడని కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం అన్నాడు. తాజాగా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా రాహుల్‌కు మద్దతు తెలిపాడు. ‘వన్డే ఫార్మాట్లో రాహుల్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. అతడి స్థానంలో మరొకరు బరిలోకి దిగడం కష్టమే. అయితే.. రాహుల్ ప్లేస్‌కు రిషభ్ పంత్ మాత్రమే పోటీదారుడు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఐదో స్థానంలో రాహుల్ తప్ప మరో ఆటగాడి గురించి ఆలోచించడం చాలా కష్టం’ అని జాఫర్ అన్నాడు.
కోల్‌కతాలోని ఈడెన్స్ గార్డెన్లో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 215 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో భారత్ 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ 103 బంతుల్లో 64 రన్స్ చేశాడు. హార్ధిక్ పాండ్యా (32)తో ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించాడు. అక్షర్ పటేల్ (21), కుల్దీప్ యాదవ్‌తో కలిసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. దాంతో వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా వన్డే సిరీస్ సొంతం చేసుకుంది.
ఇటీవలే రూర్కీ సమీపంలో జరిగిన కారు యాక్సిడెంట్లో గాయపడ్డాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేశారు. దాంతో అతను ఆస్ట్రేలియా పర్యటనకు, ఐపీఎల్‌కు దూరం కానున్నాడు.