Paris Olympics : ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) పండుగ మొదలైంది. విశ్వ క్రీడల్లో పతకాల పంట పడించేందుకు పలు దేశాల అథ్లెట్లు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. ఒలింపిక్ విలేజ్(Olympic Village)లోని క్రీడాకారులకు మాత్రం రుచికరమైన, బలమైన తిండి అరకొరగానే అందుతోంది. అవును.. అథ్లెట్లకు వడ్డించే అహారం విషయంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఫుడ్ మెనూలోని మాంసం (చికెన్, మటన్), పాల పదార్థాలైన చీజ్ వంటివి కొద్ది మోతాదులోనే వడ్డిస్తున్నారు. ఇలా ఎందుకంటే..? మెగా టోర్నీలో పాల్గొంటున్న అథ్లెట్లకు జంతువులకు సంబంధించిన ప్రొటీన్(Animal Protein)ను తక్కువగా ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకుల తప్పేమీ లేదు.
ఐక్యరాజ్య సమితి(United Nations)కి చెందిన ఆహారం, వ్యవసాయ సంస్థ(FAO) నియమాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జంతువుల పోషణ వల్ల 15 శాతం కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. ఈ గ్రీన్ హస్ వాయువుల కారణంగా ఏటా భూతాపం(Global Warming) ఎక్కువవుతోంది. అందుకని ఒలింపిక్స్ నిర్వాహకులు అథ్లెట్లకు మాంసం, చీజ్ వంటివి మితంగా సర్వ్ చేయాలని నిర్ణయించారు.