Nothing Phone 2a Plus | 31న భారత్ మార్కెట్లో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Nothing Phone 2a Plus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ (Nothing Phone 2a Plus) ఫోన్‌ను ఈ నెల 31న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Nothing Phone 2a Plus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ (Nothing Phone 2a Plus) ఫోన్‌ను ఈ నెల 31న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత మార్చిలో నథింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a)ను ఆవిష్కరించింది. తాజాగా ఆవిష్కరించనున్న నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ (Nothing Phone 2a Plus)ను మెరుగైన ఫీచర్లు, సాఫ్ట్ వేర్‌తో వస్తుందని భావిస్తున్నారు.
మార్చిలో ఆవిష్కరించిన నథింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a) ఫోన్ బ్లూ, రెడ్, ఎల్లో కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.23,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.25,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.27,999లకు లభిస్తాయి.
నథింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a) ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తోపాటు 6.7 అంగుళాల 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ + (1080×2412 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ నథింగ్ ఓఎస్ 2.5 వర్షన్ పై పని చేస్తుంది. రెండు 50-మెగా పిక్సెల్ సెన్సర్ రేర్ కెమెరాలు, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

