Neeraj Chopra | అండర్ -19 జట్టుతో నీరజ్ చోప్రా.. ఫోటోలు షేర్ చేసిన బీసీసీఐ
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడనున్న భారత జట్టును ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కలిశాడు. జట్టు సభ్యులకు విలువైన సందేశం ఇచ్చి, వాళ్లలో స్ఫూర్తి నింపాడు. నీరజ్, భారత జట్టుతో దిగిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది.
Neeraj Chopra : మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడనున్న భారత జట్టును ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కలిశాడు. జట్టు సభ్యులకు విలువైన సందేశం ఇచ్చి, వాళ్లలో స్ఫూర్తి నింపాడు. మ్యాచ్ ఆసాంతం ఆత్మవిశ్వాసంతో ఉండాలని చెప్పడంతో పాటు ఒత్తిడిలో ఎలా ఆడాలి? అనేది వివరించాడు. అంతేకాదు టీమిండియా జెర్సీ వేసుకొని వాళ్లతో కలిసి ఫొటోలకు పోజిచ్చాడు. నీరజ్, భారత జట్టుతో దిగిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. ‘అత్యంత విలువైన సమావేశం. జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ ముందు భారత జట్టుతో ముచ్చటించాడు’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది.
ఈరోజు జరగబోయే టైటిల్ పోరులో యువ భారత్, ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనుంది. షెఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా సెమీఫైనల్లో కివీస్‌ను 8 వికెట్లతో చిత్తు చేసింది. రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను ఓడించింది. మహిళల అండర్ -19 టీ20 వరల్డ్ కప్‌ను ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తోంది. దాంతో, ప్రతిష్ఠాత్మకమైన ఈ ట్రోఫీని నెగ్గాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది.
తొలి అథ్లెట్ నీరజ్ చోప్రా
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించాడు. ఫైనల్లో అతను 87.58 మీటర్ల దూరం జావెలిన్ విసిరి చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
A Gold-standard meeting! 👏👏
Javelin thrower & Olympic Gold medallist @Neeraj_chopra1 interacted with #TeamIndia ahead of the #U19T20WorldCup Final! 👍 👍 pic.twitter.com/TxL5afL2FT
— BCCI (@BCCI) January 28, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

