LSG vs MI : ఐపీఎల్ పదిహేడో సీజన్ 48వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తలపడుతున్నాయి. లక్నో గడ్డపై జరుగుతున్న ఈ పోరులో కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ప్లే ఆఫ్స్ రేసుకు పోటీ పెరగడంతో ఇరుజట్లు విజయంపై కన్నేశాయి. గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమైన లక్నో పేసర్ మయాంక్ యాదవ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నేహల్ వధేరా, టిమ్ డేవిడ్, నబీ, గెరాల్డ్ కొయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.
లక్నో తుది జట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, అయుష్ బదొని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.