Loksabha Elections 2024 | కాషాయ పార్టీ కుయుక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం : రాహుల్ గాంధీ
Loksabha Elections 2024 : రాజ్యాంగ మార్పులు, రిజర్వేషన్ల వ్యవహరంలో కాషాయ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
Loksabha Elections 2024 : రాజ్యాంగ మార్పులు, రిజర్వేషన్ల వ్యవహరంలో కాషాయ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భింద్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. తాము ఎన్నికల్లో విజయం సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, దాన్ని రద్దు చేస్తామని అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. రాజ్యాంగం దేశంలోని పేద ప్రజల ఆత్మని రాహుల్ పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని ఏ ఒక్కరూ తాకలేరని, ఈ ప్రపంచంలో ఏ శక్తీ దాన్ని మార్చలేదని కానీ బీజేపీ నేతలు మాత్రం కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. బాబా సాహెబ్‌తో పాటు బ్రిటిషర్లతో పోరాడిన వ్యక్తులు ప్రజల గొంతుకగా రాజ్యాంగాన్ని తయారు చేశారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని చెరిపేయడాన్ని రైతులు, కార్మికులు సహించరని దాన్ని తాము కాపాడితీరుతామని స్పష్టం చేశారు. కాగా మోదీ ప్రభుత్వం మూడోసారి అధికార పగ్గాలు చేపడితే బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ సహా విపక్షాలు కాషాయ పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయి.
అయితే రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు పదేపదే చెబుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లను రద్దు చేయాలని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కోరుకున్నా అది సాధ్యం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి కుట్రలను ఛేదించేందుకే ఎన్డీయే కూటమికి 400కుపైగా సీట్లు కట్టబెట్టాలని ప్రజలను కోరుతున్నామని ప్రధాని చెబుతున్నారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

