Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Gujarat Government: గుజరాత్ ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ప్రచురించే గుజరాత్ దీపోత్సవీ అంక్ ఆన్లైన్ మ్యాగ్జిన్ నుంచి ఓ వివాదాస్పద కవితను తొలగించారు. విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ కవితను మార్చేశారు. శ్రీరాముడు, మీరాభాయ్ గురించి అభ్యంతరకర రీతిలో కవిత్వం ఉన్నట్లు వీహెచ్‌పీ ఆరోపించింది.
అహ్మదాబాద్: గుజరాత్(Gujarat) ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ప్రచురించే గుజరాత్ దీపోత్సవీ అంక్ ఆన్లైన్ మ్యాగ్జిన్ నుంచి ఓ వివాదాస్పద కవితను తొలగించారు. విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ కవితను మార్చేశారు. శ్రీరాముడు, మీరాభాయ్ గురించి అభ్యంతరకర రీతిలో కవిత్వం ఉన్నట్లు వీహెచ్‌పీ ఆరోపించింది. కవి అజీజ్ తంకర్వీ ఆ కవితను రాశారు. ఆ వివాదాస్పద కవిత స్థానంలో ప్రకాశ్ జలాల్ అనే కవి రాసిన జోయే అనే కవితను ఆన్లైన్లో ప్రచురించారు. అజీజ్ రాసిన కవితను తక్షణమే తొలగించాలని అక్టోబర్ 23వ తేదీన సీఎం భూపేంద్ర పటేల్‌కు వీహెచ్‌పీ లేఖ రాసింది. రచయితతో పాటు ఆ కవితను ఆమోదించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ కోరింది.
అయితే తంకర్వీ కవితను రీప్లేస్ చేసినట్లు గుజరాత్ వీహెచ్‌పీ ప్రతినిధి హితేంద్రసిన్హా రాజ్‌పుత్ తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కవితను తొలగించడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ ఏడాది ప్రచురితమైన వార్షిక మ్యాగ్జిన్‌కు చెందిన 389వ పేజీలో ఆ కవిత పబ్లిష్ అయినట్లు వీహెచ్‌పీ నేత అశ్వినీ పటేల్ తెలిపారు. శ్రీరాముడు, మీరాభాయ్ గురించి తప్పుగా రాసిన ఆ కవితను ప్రభుత్వ పబ్లికేషన్‌లో జోడించడం దారుణమని వీహెచ్‌పీ పేర్కొన్నది. 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగివస్తున్న శ్రీరాముడి గురించి ఆ కవితలో అనుచితంగా రాసినట్లు తెలిసింది.
దేశం, మతం, సంస్కృతి గురించి సంపూర్ణ అవగాహన ఉన్న రచయితలను మాత్రమే ఎంకరేజ్ చేయాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. సమచార, ప్రసార శాఖ కార్యదర్శి విక్రాంత్ పాండే దీనిపై ప్రకటన చేయలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

