Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Fauzi | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’ చుట్టూ వివాదం మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్రకు సంబంధించిన అంశాలను సినిమాలో వక్రీకరించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై నేతాజీ మనవడు, ఆయన కుటుంబానికి చెందిన చంద్రకుమార్ బోస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
Fauzi | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’ చుట్టూ వివాదం మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్రకు సంబంధించిన అంశాలను సినిమాలో వక్రీకరించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై నేతాజీ మనవడు, ఆయన కుటుంబానికి చెందిన చంద్రకుమార్ బోస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. చరిత్రను తప్పుగా చూపించినందుకు చిత్ర దర్శకుడు భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన అంశాలను చిత్రాల్లో చూపించే విషయంలో దర్శకులు జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రకుమార్ బోస్ అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా నేతాజీ, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో సమావేశమైన సందర్భాన్ని సినిమాలో తప్పుగా చిత్రీకరించారనే ఆరోపణలు ఆయన చేశారు. స్వాతంత్య్ర పోరాటం, దానికి నాయకత్వం వహించిన ప్రముఖుల గురించి సినిమాలు తీయడానికి చిత్రనిర్మాతలకు స్వేచ్ఛ ఉంది కాని, సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో చారిత్రక వాస్తవాలను వక్రీకరించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ నాయకుల గురించి సినిమాలు తీసేటప్పుడు వాస్తవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రకుమార్ బోస్ వ్యాఖ్యానించారు. చారిత్రక అంశాలను తప్పుగా చూపిస్తూ కల్పిత కథనాలను జోడించడం నేరంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. నేతాజీ హిట్లర్‌తో జరిపిన భేటీకి సంబంధించిన అంశాలను వక్రీకరించడం ద్వారా స్వాతంత్య్ర సమరయోధుడి స్థాయిని తగ్గించినట్లుగా సినిమా ఉందని ఆయన ఆరోపించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ‘ఫౌజీ’ దర్శకుడు భారత ప్రజలకు, దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని గౌరవించే వారందరికీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’పై వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే చంద్రకుమార్ బోస్ చేసిన ఆరోపణలకు సంబంధించి చిత్రబృందం అధికారికంగా స్పందిస్తుందా, సినిమాలో నేతాజీకి సంబంధించిన సన్నివేశాలను ఏ విధంగా చిత్రీకరించారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి ఆరోపణలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. చిత్రబృందం వివరణ లేదా సినిమాలోని సంబంధిత సన్నివేశాలపై పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

