Team India | ఆ ఐదుగురికి ఆఖరి చాన్స్.. కప్పుతో ముగిస్తారా..?
Team India : భారత జట్టులో సీనియర్ల శకం ముగిసేందుకు సమయం దగ్గర పడుతోంది. కొన్నేండ్లుగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)లు కెరీర్లో ఆఖరి టీ20 వరల్డ్ కప్ ఆడనున్నారు.
Team India : భారత జట్టులో సీనియర్ల శకం ముగిసేందుకు సమయం దగ్గర పడుతోంది. కొన్నేండ్లుగా
టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)లు కెరీర్లో ఆఖరి టీ20 వరల్డ్ కప్ ఆడనున్నారు. ఈ ఇద్దరితో పాటు మిస్టర్ 360గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)వ్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, మేటి ఆల్‌రౌడర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)లకు ఇదే చివరి పొట్టి ప్రపంచకప్.
కారణమేంటంటే.. ఇప్పటికీ కోహ్లీ, హిట్‌మ్యాన్, జడ్డూలు 35 ఏండ్లు దాటేశారు. సూర్యకుమార్, ఈ మధ్యే ఐపీఎల్లో 200 వికెట్లతో చరిత్ర సృష్టించిన చాహల్(Chahal)కు ప్రస్తుతం 33 ఏండ్లు. వయసు, ఫిట్నెస్ రీత్యా వీళ్లంతా మరో పొట్టి ప్రపంచ కప్ ఆడడం దాదాపు అసాధ్యమే. దాంతో, 11 ఏండ్లుగా భారత జట్టుకు అందని ద్రాక్షలా మిగిలిన ఐసీసీ ట్రోఫీ అందించేందుకు ఈ ఐదుగురు సిద్దమవుతున్నారు.

పొట్టి ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ 19 మందితో స్క్వాడ్‌ను ప్రకటించింది. ఊహించినట్టుగానే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లు చోటు దక్కించుకోగా.. ఐపీఎల్లో సిక్సర్లతో చెలరేగుతున్న శివం దూబే, యశస్వీ జైస్వాల్ సైతం వరల్డ్ కప్ బెర్తు ఖాయం చేసుకున్నారు.
భారత స్క్వాడ్ : ఇదే రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు : శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.

మూడుసార్లు నిరాశే..
భారత క్రికెట్ జట్టు ఐదో ఐసీసీ ట్రోఫీ వేటకు సిద్ధమైంది. కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలో 1983 వరల్డ్ కప్ ముద్దాడిన టీమిండియా.. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ(MS Dhoni) కెప్టెన్సీలో ఏకంగా మూడు ట్రోఫీలు గెలుచుకుంది. 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మూడుసార్లు ఐసీసీ ఫైనల్ చేరినా భారత జట్టుకు నిరాశే మిగిలింది. 2021-22లో కోహ్లీ సేనకు చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్ టెస్టు గదను తన్నుకుపోగా.. నిరుడు ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ, వన్డే ట్రోఫీలను ఎగరేసుకుపోయింది.
ఐసీసీ ట్రోఫీలతో ధోనీ

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

