అస్తానా: కజకిస్థా న్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్‌లో భారత బాక్సర్లు మీనాక్షి, పూజారాణి సెమీఫైనల్స్‌కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు.
బుధవారం జరిగిన మహిళల 48కిలోల క్వార్టర్స్‌లో మీనాక్షి 5-0తో గువో యి జువాన్(చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించింది. 80కిలోల కేటగిరీలో పూజారాణి 4-1తో గులసయ యెర్జెన్(కజకిస్థాన్)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది.