Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలతో మెరిసిన మను భాకర్ (Manu Bhaker) భావి షూటర్లకు స్ఫూర్తిగా మారింది. ఒకే విశ్వ క్రీడల్లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను.. పారా షూటర్ అవని లేఖరా(Aavni Lekhara)పై ప్రశంసలు కురిపించింది. పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్(Paralympics 2024)లో పసిడితో రికార్డు నెలకొల్పిన అవని నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అంది.
‘పారా షూటర్ అవని ఒలింపిక్ జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ఒక్కరే కాదు పారా క్రీడాకారుల జర్నీ కూడా ప్రశంసించదగ్గదే. వాళ్లంతా సవాళ్లను అధిగమించి దేశానికి పతకాలు గెలుపొందారు. మనమంతా వాళ్లను చూసి చాలా నేర్చుకోవాలి. నాకు చాలా గర్వంగా ఉంది. అవనితో పాటు పతకాలు సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు’అని మను తెలిపింది. 2012లో జరిగిన ఓ కారు ప్రమాదం అవని జీవితాన్ని మార్చేసింది.
అవని లేఖరా
ఆ యాక్సిడెంట్‌తో ఆమె నడుము కింది భాగమంతా చచ్చుబడిపోయింది. అయినా సరే.. పట్టువదలకుండా అవనీ షూటింగ్లో అద్భుతాలు చేస్తూ వస్తోంది. టోక్యో పారాలింపిక్స్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించిన ఆమె.. ఈ క్రీడల్లో రెండు స్వర్ణాలు గెలుపొందిన భారత తొలి పారా షూటర్‌గా చరిత్ర సృష్టించింది.
A big congratulations to Avani Lekhara on her incredible Gold medal achievement and to Mona Agarwal for clinching the Bronze at the Paris Paralympics! Your achievements are a testament to perseverance and talent. Well done! 🎉🏅👏 #Paralympics #Paris2024 #WomenInSports… pic.twitter.com/XKKkZtDZsV
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) August 30, 2024
పారిలింపిక్స్ భారత క్రీడాకారులు పతకాల వేటలో దూసుకెళ్తుస్తున్నారు. ఇప్పటికే ఒక స్వర్ణం, రజతం సహా రెండు కాంస్యాలు వచ్చాయి. తొలుత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అవనీ లేఖరా(Aanvi Lekhari) పసిడితో గర్జించగా.. మోనా అగర్వాల్ (Mona Agarwal) కంచు మోత మోగించింది. వీళ్ల స్ఫూర్తితో అథ్లెట్ ప్రీతి పాల్(Preethi Pal) సైతం సంచలనం సృష్టించింది. అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పతకం సాధించి పెట్టింది.
ప్రీతి పాల్
టోక్యోలో పసిడి కొల్లగొట్టిన షూటర్ మనీశ్ నర్వాల్(Manish Narwal) సైతం ఈసారి రజతంతో మెరిశాడు. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో మనీశ్ సూపర్ గురితో వెండి వెలుగులు విరజిమ్మాడు. దాంతో, భారత్ ఖాతాలో ఇప్పటివరకూ నాలుగో పతకం చేరింది.