అహ్మదాబాద్: దొంగతనం చేశాడన్న ఆరోపణలపై షాపు యజమాని, అతడి అనుచరులు కలిసి ఒక వ్యక్తిని కొట్టారు. ఆ తర్వాత కారు బానెట్‌కు తాళ్లతో కట్టేశారు. ఆ కారుపై కట్టేసి ఉన్న అతడ్ని ఊరేగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Gujarat Man Tied To Car) గుజరాత్‌లోని గోద్రాలో ఈ సంఘటన జరిగింది. కిషోర్ బావ్రీ అనే వ్యక్తి శుక్రవారం సీడ్స్, ఫెర్టిలైజర్స్ షాప్‌కు వెళ్లాడు. విత్తనాలు కొని డబ్బులు చెల్లించడం మరిచిపోయినట్లు అతడు చెప్పాడు.
కాగా, కిషోర్ తన షాపులో చోరీకి ప్రయత్నించినట్లు షాపు యజమాని గణపత్‌సింగ్ పర్మార్ ఆరోపించాడు. తన అనుచరులతో కలిసి ఆ వ్యక్తిని కొట్టాడు. ఆ తర్వాత కిషోర్‌ను కారు బానెట్‌కు తాళ్లతో కట్టేశారు. ఆ కారును నడిపి దానిపై కట్టేసి ఉన్న అతడ్ని ఆ ప్రాంతంలో తిప్పారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. కిషోర్‌ను కారుపై కట్టేసి ఊరేగించిన షాపు యజమాని, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ ఆరోపణలపై కిషోర్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
गुजरात में चोरी की कोशिश करते हुए पकड़ा गया युवक, लोगों ने कार की बनोट से बांधा।।
कानून का भय खत्म हो चुका है लोगो मे स्वयं न्यायालय बन गए हैं।। pic.twitter.com/0C2z60hETw
— Sanju Singh 🇮🇳 (@sanju_singh24) August 31, 2024