ODI World Cup| వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సఫారీ బౌలర్ల ధాటికి డచ్ బ్యాటింగ్ లైనప్ విఫలమైంది. ఆఖర్లో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌తో పాటు లోయరార్డర్ బ్యాటర్లు బాదడంతో నెదర్లాండ్స్ జట్టు.. 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేయగలిగింది. డచ్ బ్యాటర్లలో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ రాణించారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసొ రబాడాలు తలా రెండు వికెట్లు తీశారు.
వర్షం వల్ల రెండు గంటలు ఆలస్యంగా (43 ఓవర్లకు కుదించారు) మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌కు శుభారంభం దక్కలేదు. నాలుగు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (18) క్రీజులో నిలువలేకపోయాడు. మరో ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ 16 బంతులాడి రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. నెదర్లాండ్స్ భారీ ౠశలు పెట్టుకున్న కొలిన్ అకర్మన్ (13), బాస్ డీ లీడె (2) లు కూడా విఫలమయ్యారు. తొలి పవర్ ప్లే (1-9) లోనే తడబాటుకు లోనైన డచ్ టీమ్ ఆ తర్వాత కూడా కోలుకోలేకపోయింది. సఫారీ పేసర్లు రబాడా, జాన్సెన్, కొయెట్జ్, ఎంగిడిలు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్‌పై ఒత్తిడి పెంచారు.
ఆఖర్లో బాదిన కెప్టెన్..
112 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్‌ను ఆ జట్టు సారథి స్కాట్ ఎడ్వర్డ్స్ (69 బంతుల్లో 78, 10 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఎడ్వర్డ్స్.. సఫారీ బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. ఏడో వికెట్‌కు లొగన్ వాన్ బీక్ (10) తో కలిసి 28 పరుగులు జోడించిన అతడు.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రొలొఫ్ వాన్ డెర్ మెర్వ్‌తో కలిసి ఆఖర్లో డచ్ జట్టును రెండు వందల పరుగుల మైలురాయిని దాటించాడు. వాన్ డెర్ మెర్వ్ 19 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్‌కు 37 బంతుల్లోనే 64 పరుగులు జతచేశారు. రబాడా వేసిన 39.5వ ఓవర్లో నాలుగో బంతిని బౌండరీకి తరలించిన ఎడ్వర్డ్స్.. 54 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఎంగిడి వేసిన 40వ ఓవర్లో కూడా రెండు బౌండరీలు బాదాడు. ఇదే ఓవర్లో ఐదో బంతికి వాన్ డెర్ మెర్వ్ నిష్క్రమించినా ఆ తర్వాత వచ్చిన ఆర్యన్ దత్ (9 బంతుల్లో 23, 3 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడి క నెదర్లాండ్స్‌కు పోరాడే స్కోరును అందించారు. ఎడ్వర్డ్స్ – ఆర్యన్లు ఎనిమిదవ వికెట్‌కు 19 బంతుల్లోనే 41 పరుగులు జోడించడం విశేషం. ఆఖరి ఐదు ఓవర్లలో డచ్ టీమ్.. 68 పరుగులు పిండుకుంది.