ప్రపంచంలో క్రికెట్ ఆడే ప్రతి దేశంలో టీ20 లీగ్‌లు మొదలవుతున్నాయి. పెద్ద దేశాలన్నీ టెస్టు క్రికెట్‌పై ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలో వన్డే క్రికెట్ ప్రాధాన్యం రోజురోజుకూ పడిపోతూ వస్తోంది. తాజాగా ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే క్రికెట్ నెమ్మదిగా చచ్చిపోతోందని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టెస్టు, టీ20 ఫార్మాట్లు కలిసి ఉండగలవన్నాడు. తనకు తెలిసిన చాలామంది ఆటగాళ్లకు టెస్టు క్రికెట్ అంటే ఇష్టం ఉందని, అలా చూసుకున్నా టెస్టు ఫార్మాట్‌కు వచ్చిన ప్రమాదమేమీ లేదని వివరించాడు.
అదే సమయంలో టీ20 ఫార్మాట్లో కావలసినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కాబట్టి అది కూడా రాణిస్తుందన్నాడు. ఈ నేపథ్యంలోనే వన్డే క్రికెట్ ఎటూ కాకుండా పోతోందని, నెమ్మదిగా చచ్చిపోతోందని అభిప్రాయపడ్డాడు.