Novak Djokovic : టెన్నిస్‌లో నొవాక్ జకోవిచ్ ఒక సంచలనం. చిరుప్రాయంలోనే కోర్టులో అడుగుపెట్టిన అతను దిగ్గజాలైన రోజర్ ఫెదరర్(Roger Federer), రఫెల్ నాదల్(Rafael Nadal)కు కొరకరాని కొయ్యగా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు వాళ్లను పెద్ద టోర్నమెంట్లలో ఓడించి కొత్త చాంపియన్‌గా అవతరించాడు. అనతికాలంలోనే టెన్నిస్‌పై తన ముద్ర వేశాడు. 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన జకో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను ఎప్పుడూ ఫెదరర్, నాదల్‌తో ఫ్రెండ్షిప్ చేయలేదని అన్నాడు. అందుకు కారణం ఏంటో కూడా చెప్పుకొచ్చాడు.
‘టెన్నిస్‌లో లెజెండ్స్ అయిన వాళ్లిద్దరితో నేను ఏనాడూ స్నేహంగా మెలగలేదు. ఎందుకంటే..? ప్రత్యర్థుల మధ్య స్నేహం చిగురించడం దాదాపు అసాధ్యం. అయితే.. నాదల్, ఫెదరర్‌కు నా కృతజ్ఞతలు. వాళ్లిద్దరితో తలపడడం, వాళ్లను ఓడించడం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అని జకోవిచ్ తెలిపాడు. అలాగని తనకు వాళ్లంటే ద్వేషం లేదని, వాళ్లను తాను ఎంతో గౌరవిస్తాన’ని ఈ సెర్బియా స్టార్ వివరించాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2023 ట్రోఫీతో జకోవిచ్
ఫెదరర్, జకోవిచ్ టెన్నిస్ కోర్టులో 50 సార్లు తలపడ్డారు. జకో 27 మ్యాచ్‌లు గెలిచి స్విస్ స్టార్‌పై ఆధిపత్యం చెలాయించాడు. వరల్డ్ నంబర్ 1గా ఎదిగాడు. అయితే.. ఫెదరర్ ఏడాది క్రితమే ఆటకు వీడ్కోలు పలికాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న నాదల్ మెగా టోర్నీలు ఆడడం లేదు. దాంతో, జకోవిచ్‌కు ఎదురు లేకుండా పోయింది. కానీ, యంగ్‌స్టర్ కార్లోస్ అల్కరాజ్ రూపంలో అతడికి గట్టి పోటీ ఎదురవుతోంది. మే 22 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది. నాదల్ వైదొలగడంతో జకో టైటిల్‌పై కన్నేశాడు. 23వ గ్రాండ్ స్లామ్ సాధిస్తాడా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం నాదల్ ఖాతాలో 22, ఫెదరర్ ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉన్నాయి.