Mohsin Khan | ఒక నెల ఆలస్యమైతే డాక్టర్లు నా చేయి తొలగిస్తామన్నారు : లక్నో స్టార్ మొహ్సిన్
Mohsin Khan : ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కీలక మ్యాచ్‌లో చెలరేగింది. ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై అనూహ్యంగా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో అద్భుత విజయంలో ఎడమ చేతివాటం పేసర్ మొహ్సిన్ ఖాన్(Mohsin Khan) కీలక పాత్ర పోషించాడు. అతను 20వ ఓవర్లో కేవలంల 5 పరుగులు మాత్రేమే ఇచ్చాడు. దాంతో, ముంబై 172కే పరిమితమైంది.
Mohsin Khan : ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కీలక మ్యాచ్‌లో చెలరేగింది. ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై అనూహ్యంగా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో అద్భుత విజయంలో ఎడమ చేతివాటం పేసర్ మొహ్సిన్ ఖాన్(Mohsin Khan) కీలక పాత్ర పోషించాడు. అతను 20వ ఓవర్లో కేవలంల 5 పరుగులు మాత్రేమే ఇచ్చాడు. దాంతో, ముంబై 172కే పరిమితమైంది. ఒత్తిడిలోనూ సూపర్ స్పెల్‌తో ఆకట్టుకున్న మొహ్సిన్ తన జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గత ఏడాది ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో ఉన్న రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.
సర్జరీ ఒక నెల ఆలస్యమైతే వైద్యులు తన ఎడమ చేతిని తొలగిస్తామని చెప్పారని అతను తెలిపాడు. ‘నా గాయం గురించి చెప్పాలంటే.. మరే క్రికెటర్‌కు అలాంటి పరిస్థితి రాకూడదు. అదొక కొత్తరకం సమస్య. గత ఏడాది నా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు మూసుకుపోయాయి. నరాలు బ్లాక్ అయ్యాయి. మరింత ఆలస్యం చేస్తే పూర్తిగా చేయి తీసేస్తామని చెప్పారు. దాంతో, ఎంతో కంగారు పడ్డాను. కానీ ఆ కష్ట సమయంలో నా కుటుంబం, లక్నో ఫ్రాంఛైజీ, కోచ్ గౌతం గంభీర్ అండగా నిలిచారు’ అని మొహ్సిన్ ఖాన్ తెలిపాడు. సర్జరీ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న మొహ్సిన్ ఈ సీజన్లో కొన్ని మ్యాచ్‌లే ఆడాడు. 2022లో ఆడింది తొమ్మిదే మ్యాచులే అయినే 14 వికెట్లు పడగొట్టాడు.
𝗠𝗮𝗴𝗶𝗰𝗮𝗹 𝗠𝗼𝗵𝘀𝗶𝗻 powers @LucknowIPL to victory at home 🙌#LSG clinch a narrow 5-run win over #MI and grab 2️⃣ crucial points 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/yxOTeCROIh #TATAIPL | #LSGvMI pic.twitter.com/2RKA1OF5Ip
— IndianPremierLeague (@IPL) May 16, 2023
స్టోయినిస్, కృనాల్ ఆడడంతో
ప్లే ఆఫ్స్‌లో ఉండాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో 177 రన్స్ కొట్టింది. స్టోయినిస్ (89), కృనాల్ పాండ్యా(49 రిటైర్డ్హట్) రాణించారు. లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్(59) హాఫ్ సెంచరీతో మెరిశాడు. మరోవైపు టిమ్ డేవిడ్(32 నాటౌట్) ధనాధన్ ఆడడంతో రోహిత్ సేన అవలీలగా గెలుస్తుందనిపించింది. కానీ, లక్నో బౌలర్లు విజృంభించి వెంట వెంటనే వికెట్లు తీశారు. ముఖ్యంగా మొహ్సిన్ ఖాన్ వేసిన 20వ ఓవర్లో అద్భుతం చేశాడు. కామెరూన్ గ్రీన్(4), టిమ్ డేవిడ్(32) వంటి హిట్టర్లకు అతను ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి మూడు బంతులకు రెండు రన్స్ ఇచ్చాడంతే. నాలుగో బంతికి యార్కర్. ఐదో బంతికి ఒక రన్, ఆరో బంతికి రెండు పరుగులు వచ్చాయంతే. దాంతో, లక్నో 5 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది. ప్లే ఆఫ్స్ దిశగా ఒక అడుగు ముందుకు వేసింది. లక్నో 15 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది.
ఇవి కూడా చదవండి
IPL 2023: కుక్కకాటుకు గురైన అర్జున్ టెండూల్కర్
IPL 2023: ప్లేఆఫ్స్‌కు వెళ్లే జట్లు ఏవి.. మిగతా టీంలకు ఉన్న అవకాశాలెన్ని.?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

