Arjun Tendulkar: సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కుక్కకాటుకు గురయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించాడు. దీనికి సంబంధించి ఓ వీడియోను లక్నో ట్విట్టర్లో పోస్టు చేసింది.
లక్నోతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా యుధ్వీర్తో మాట్లాడుతున్న సందర్భంగా కుక్కకాటు గురైన విషయాన్ని వెల్లడించాడు. ఎలా ఉన్నావ్ అని యుధ్వీర్ అడగగా, కుక్క కరిచిందని అర్జున్ టెండూల్కర్ తెలిపాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ 9.36 ఎకానమీ రేట్‌తో 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
Mumbai se aaya humara dost. 🤝💙 pic.twitter.com/6DlwSRKsNt
— Lucknow Super Giants (@LucknowIPL) May 15, 2023