IPL 2023: ప్లేఆఫ్స్‌కు వెళ్లే జట్లు ఏవి.. మిగతా టీంలకు ఉన్న అవకాశాలెన్ని.?
ఐపీఎల్ 2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ దాదాపు ఎలిమినేట్ అయినట్లే. ఢిల్లీ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి.
IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ మాత్రమే అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఢిల్లీ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి. మిగతా మూడు స్థానాల కోసం టీంల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ దాదాపు ఎలిమినేట్ అయినట్లే. ఏయే టీంలు ప్లేఆఫ్స్‌కు చేరుకునేందుకు అవకాశం ఉందో ఒకసారి చూసినట్లయితే..
చెన్నై సూపర్ కింగ్స్
ప్రస్తుతం టేబుల్లో 15పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. చెన్నై దాదాపు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినట్లే. మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న చెన్నై తన చివరి మ్యాచ్‌ను ఢిల్లీతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 17పాయింట్లతో రెండో స్థానంతో తన లీగ్ స్టేజ్‌ను ముగించే అవకాశం ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్
ముంబైపై అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సాధించిన లక్నో 15పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టాప్ 4లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. అంతేకాకుండా చెన్నై తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీపై ఓడిపోయి, లక్నో కోల్‌కతాపై మెరుగైన రన్‌రేట్‌తో గెలుపొందితే టేబుల్లో రెండవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ముంబై ఇండియన్స్
లక్నోపై ఓడిపోవడంతో ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 14పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచ్ సన్‌రైజర్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవడంతోపాటు మెరుగైన రన్‌రేట్ సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది.
రాజస్థాన్ రాయల్స్
ప్రస్తుతం 13 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ టేబుల్లో 6వ స్థానంలో ఉంది. అయితే రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌ను పంజాబ్‌తో ఆడాల్సి ఉంది. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే పంజాబ్‌తో మ్యాచ్‌లో గెలవడంతో పాటు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాటి చివరి మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉన్న బెంగళూరు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఒక మ్యాచ్‌లో ఓడి మరో మ్యాచ్‌లో గెలిస్తే, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
పంజాబ్ కింగ్స్
12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 8స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న పంజాబ్ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే రెండు మ్యాచుల్లో గెలుపొందటంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. అంతేకాకుండా నెగెటివ్ రన్‌రేట్ కలిగి ఉన్న పంజాబ్ తన చివరి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

