Paris Olympics 2024 | మండుటెండల్లో ఒలింపిక్స్.. అయినా అథ్లెట్ల గదుల్లో నో ఏసీ.. ఎందుకంటే..?
Paris Olympics 2024 : ప్యారిస్ వేదికగా జూన్ నెలలో ఒలింపిక్స్(Paris Olympics 2024) పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే క్వాలిఫయింగ్ రౌండ్లు దాదాపు పూర్తి అయ్యాయి. దాంతో, విశ్వ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల బస, ఇతర ఏర్పాట్లను నిర్వాహకులు వేగవంతం చేశారు. అయితే.. అథ్లెట్లకు కేటాయించిన గదుల్లో ఏసీ...
Paris Olympics 2024 : ప్యారిస్ వేదికగా జూన్ నెలలో ఒలింపిక్స్(Paris Olympics 2024) పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే క్వాలిఫయింగ్ రౌండ్లు దాదాపు పూర్తి అయ్యాయి. దాంతో, విశ్వ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల బస, ఇతర ఏర్పాట్లను నిర్వాహకులు వేగవంతం చేశారు. అయితే.. అథ్లెట్లకు కేటాయించిన గదుల్లో ఏసీ (AC) లు వాడడం లేదట. అయినా సరే వాళ్లకు ఇసుమంత కూడా అసౌకర్యం ఉండదని ఆర్గనైజర్స్ అంటున్నారు.
మండుటెండల్లో ఏసీలు లేకుండా చల్లదనం ఎలా? అని ఆలోచనల్లో పడ్డారా. అయితే.. ప్యారిస్‌లోని ఒలింపిక్స్ గ్రామంలో అథ్లెట్లు బస చేసే గదలును ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి రూమ్‌లో ఏసీలకు బదులు ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్(Cooling System)ను ఏర్పాటు చేశారు.
ప్యారిస్ – ఒలింపిక్ గ్రామంలోని అపార్ట్మెంట్

అథ్లెట్ల కోసం నిర్మించిన గదుల్లో ఏసీలు అవసరం లేదు. ఎందుకంటే మేము ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్ ఉపయోగించాం. అథ్లెట్లకు కేటాయించే అపార్ట్మెంట్లలోకి ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అంతేకాదు ఈ గదుల నిర్మాణంలో భూగర్భం నుంచి తీసిన సహజసిద్ధమైన చల్లని నీటిని వాడాం. దాంతో, గదులన్నీ చల్లగా ఉంటాయి. అలాంటప్పుడు ఏసీల అవసరం ఏముంది అని యన్ క్రిసిన్స్కీ(Yann Krysinski) అనే అధికారి తెలిపారు.
ఒలింపిక్స్ అథ్లెట్లకు కేటాయించనున్న గదులు

ఈ ఏడాది జూన్ 26వ తేదీన ప్యారిస్ వేదిక ఒలింపిక్స్ మొదలవ్వనున్నాయి. యూరప్‌లో ఆ సమయానికి ఎండలు ఓ రేంజ్లో ఉంటాయి. అందుకని జనమంతా ఏసీలు ఎక్కువగా వినియోగిస్తారు. అందుకని అథ్లెట్ల గదుల్లో ఏసీల బదులు కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అధికారులు అనుకున్నారు. మొత్తం 17 రోజుల పాటు జరిగే ఈ పోటీలు ఆగస్టు 11వ తేదీన ముగుస్తాయి. నిరుడు 19వ ఆసియా క్రీడల్లో 107 పతకాలతో చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్లు ఈసారి విశ్వక్రీడల్లో సత్తా చాటాలనే కసితో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
- Premalu Movie | తెలుగులోకి వచ్చేస్తున్న మలయాళీ బ్లాక్ బస్టర్ ‘ప్రేమలు’
- Marais Erasmus | ‘అంపైర్ ఆఫ్ ది ఇయర్’ ఎరాస్మస్ వీడ్కోలు.. ఆ సిరీసే ఆఖరిదా!
- Akhilesh Yadav | అక్రమ మైనింగ్ కేసు.. సీబీఐ విచారణకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ డుమ్మా!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

