Akhilesh Yadav | అక్రమ మైనింగ్ కేసు.. సీబీఐ విచారణకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ డుమ్మా!
అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ విచారణకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) డుమ్మా కొట్టనున్నారు. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు.
న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ విచారణకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) డుమ్మా కొట్టనున్నారు. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో సాక్షమిచ్చేందుకు నేడు ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ యూపీ మాజీ ముఖ్యమంత్రికి సీబీఐ (CBI) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. నేడు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. అయితే అఖిలేశ్ విచారణకు హాజరుకావడం లేదని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
2012-13లో అఖిలేశ్ యాదవ్ గనుల శాఖ మంత్రిగా స్వల్పకాలం పనిచేసినప్పుడు ఈ-టెండర్ విధానాన్ని అతిక్రమించి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ లీజులు మంజూరు చేశారని ఆరోపణ. ఒక పక్క గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం ఉన్నప్పటికీ 2012-16 మధ్య కాలంలో పలు గనుల లైసెన్స్‌లను అక్రమంగా రెన్యువల్ చేశారని అఖిలేశ్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ సాగిస్తున్నది. త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే తనను వేధించడానికి బీజేపీ ఈ నోటీసులు జారీ చేయించిందని అఖిలేశ్ ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

